అంతర్జాతీయం

ఫలిస్తున్న ట్రంప్ పాచిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 18: అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా గెలుపెవరిదన్న దానిపై ఉత్కంఠ తీవ్రమవుతోంది. డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు వ్యూహాత్మక రీతిలో తమ ఓటుబ్యాంకును బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అమెరికాలోని భారత సంతతి వారందరూ డెమోక్రాట్ పార్టీకే ఓటు వేస్తూ వచ్చిన నేపథ్యంలో ఇటీవల ట్రంప్ విసిరిన పాచికతో పరిస్థితి మారింది. ఇండో-అమెరికన్ ఓటుబ్యాంక్‌లోకి ట్రంప్ చొచ్చుకెళ్లడానికి, ఆవిధంగా వారిని తమవైపు తిప్పుకోవడానికి ఈ పాచిక ఎంతగానో పనిచేసిందని తాజాగా జరిగిన సర్వే బట్టి స్పష్టమవుతోంది. ఇండో-అమెరికన్ ఓటర్లను తమవైపు తిప్పుకోగలిగామని రిపబ్లికన్ పార్టీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి. కేవలం ఇండో-అమెరికన్లు హాజరైన ఓ కార్యక్రమానికి అధ్యక్ష అభ్యర్థి హాజరుకావడం ఇదే మొదటిసారని, దీని ప్రభావం ఇప్పటికిప్పుడు కనిపించకపోయినా రానున్న ఎన్నికల్లో స్పష్టంగా ద్యోతకమవుతుందని ఈ వర్గాలు చెబుతున్నాయి. మరో మూడు వారాల్లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇండో అమెరికన్లు క్రమంగా డెమోక్రాట్ పార్టీ నుంచి రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గే అవకాశం కూడా లేకపోలేదని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం ఇప్పటికిప్పుడే చోటుచేసుకోకపోయినా దీర్ఘకాలంలో ఇండో అమెరికన్లు రిపబ్లికన్ పార్టీవైపు మళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం అత్యంత నిర్మాణాత్మక రీతిలో సాగడమే కాకుండా భారత్-అమెరికాల మధ్య భావి సంబంధాల్లో వచ్చే మార్పులకు సంకేతంగా నిలిచిందని ఈ వర్గాలు తెలిపాయి. తాను దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే భారతదేశం ఓ బలమైన మిత్రుడ్ని ఎన్నుకున్నట్టేనని ట్రంప్ చెప్పడం ఇండో-అమెరికన్ల మొగ్గుకు కారణమైందని కూడా ఈ వర్గాలు విశే్లషిస్తున్నాయి.