అంతర్జాతీయం

వాళ్లంతా గూఢచారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 3: ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎనిమిది మంది అధికారులు భారత నిఘా సంస్థలకు చెందిన సభ్యులని పాకిస్తాన్ గురువారం ఆరోపించింది. ఈ ఎనిమిది మంది పాకిస్తాన్ వ్యతిరేక గూఢచార కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పలువురు భారత దౌత్యవేత్తలు, ఉద్యోగులు పాకిస్తాన్‌లో దౌత్య విధుల ముసుగులో ఉగ్రవాద, పాకిస్తాన్ వ్యతిరేక కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారని ఆరోపించారు. వారి పేర్లు, హోదాలను ఆయన వెల్లడించారు.
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ఆపరేటివ్‌లు- రా స్టేషన్ చీఫ్ అనురాగ్ సింగ్ (ప్రథమ కార్యదర్శి కమర్షియల్), కమర్షియల్ కౌన్సిలర్ రాజేశ్ కుమార్ అగ్నిహోత్రి, అమర్‌దీప్ సింగ్ భట్టి (అటాచ్ వీసా), ధర్మేంద్ర సోధి (ఉద్యోగి), విజయ్ కుమార్ వర్మ (ఉద్యోగి), మాధవన్ నందకుమార్ (ఉద్యోగి) అని ఆయన తెలిపారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేటివ్‌లు బల్బీర్ సింగ్ (ప్రథమ కార్యదర్శి, ప్రెస్ ఇన్ఫర్మేషన్, ఐబి స్టేషన్ చీఫ్), అసిస్టెంట్ పర్సనల్ వెల్ఫేర్ ఆఫీసర్ జయబాలన్ సెంథిల్ అని ఆయన చెప్పారు.
ఆ ఆరోపణలు నిరాధారం: భారత్
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎనిమిది మంది అధికారులపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని భారత్ గురువారం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ఎనిమిది మంది అధికారుల భద్రతకు ప్రమాదం వాటిల్లే రీతిలో వారి పేర్లు, ఫొటోలను పాకిస్తాన్ ప్రచురించిన తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన ఒక ఉద్యోగి గత వారం ఇక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి దేశ బహిష్కృతుడు కావడంతో అందుకు ప్రతిగా పాకిస్తాన్ దురుద్దేశంతో ఏ తప్పూ చేయని భారత హైకమిషన్‌లోని ఎనిమిది మంది అధికారుల పట్ల క్రూరంగా వ్యవహరించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ధ్వజమెత్తారు.
పాకిస్తాన్ ఆరోపణలు చేసిన ఆ ఎనిమిది మంది అధికారులను వెనక్కి పిలిపిస్తారా? అని ప్రశ్నించగా, అది విధానపరమైన అంశమని, అన్ని కోణాల్లో ఆలోచించి ప్రభుత్వం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన బదులిచ్చారు.