అంతర్జాతీయం

పాక్‌లో రెండు రైళ్లు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 3: పాకిస్తాన్‌లో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఓడరేవుల నగరం కరాచీలో రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 20 మంది మృతిచెందారు. 50 మంది గాయపడ్డారు. ప్రయాణికుల రైలును గూడ్సు రైలు ఢీకొట్టింది. ఉదయం 7.18 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న జకారియా ఎక్స్‌ప్రెస్, గూడ్స్‌రైలు (్ఫరిద్ ఎక్స్‌ప్రెస్)ను జుమాగోత్ స్టేషన్లో ఢీకొందని అధికారులు వెల్లడించారు. ఫరీద్ ఎక్స్‌ప్రెస్ రెండు బోగీలు, జకారియా ఎక్స్‌ప్రెస్ ఒక బోగీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందారని, 50 మంది గాయపడ్డారని వారు తెలిపారు. ఇటీవల కాలంలో జరిగిన రెండో అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని వారన్నారు. ఫరీద్ ఎక్స్‌ప్రెస్ లాహోర్ నుంచి కరాచీ వస్తోందని అధికారులు చెప్పారు. జకారియా రైలు ముల్తాన్ నుంచి వస్తోంది. జకారియా ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. డ్రైవర్ సిగ్నల్ గమనించకుండా రైలును ముందుకుపోనిచ్చిందునే ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి ఖ్వాజా సాద్ రఫీఖీ స్పష్టం చేశారు. క్షతగాత్రులను జిన్నా ఆసుపత్రికి తరలించారు. 50 మందిలో ఎక్కువ మంది తలపైనే గాయాలయ్యాయని ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం అధిపతి డాక్టర్ సిమీ జమాలీ తెలిపారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన అన్నారు. మరోపక్క ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాద స్థలానికి అంబులెన్స్‌లు చేరుకోడానికి చాలా సమయం తీసుకుంది. కరాచీ నుంచి వచ్చే రైళ్లన్నీ రద్దుచేసినట్టు మంత్రి వెల్లడించారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. రైలు ప్రమాదం పట్ల పాకిస్తాన్ అధ్యక్షుడు మన్నూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపి, ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షలు, గాయపడ్డవారికి ఐదు లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 150 మంది గాయపడ్డారు. పంజాబ్‌లోని ముల్తాన్ వద్ద ప్యాసింజర్ రైలు, గూడ్సును ఢీకొంది.

చిత్రం.. రైలు ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది