అంతర్జాతీయం

భారత్‌ను నిలదీయరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోల్, నవంబర్ 5: కాశ్మీర్ ప్రజలపై తీవ్రమైన అణచివేత, దారుణాలు జరుగుతున్నా భారత్‌పై ప్రధాని నవాజ్ షరీఫ్ మెతకవైఖరి ప్రదర్శిస్తున్నారని ముంబయి ఉగ్రదాడికి సూత్రధాని, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్ మండిపడ్డాడు. కాశ్మీర్ లోయలో ప్రజలు సాయంకోసం ఎదురుచూస్తున్నారని శనివారం అతడు తెలిపాడు. అక్కడి ప్రజల అణచివేతపై నవాజ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని హఫీజ్ ఆరోపించాడు. కాశ్మీర్ ప్రజలకు విముక్తి కల్పించడం, వారికి భరోసా ఇవ్వడంతో పాక్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని అతడు పేర్కొన్నాడు. మజీద్ ఇ ఖద్సియాలోని దవా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అనుచరులను ఉద్దేశించి మాట్లాడిన హఫీజ్ పాక్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశాడు. ప్రధాని నవాజ్ షరీఫ్, మంత్రులు కాశ్మీర్ ప్రజలకు అనుకూలంగా ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆయన విరుచుకుపడ్డాడు.