అంతర్జాతీయం

ఆగని నిరసనల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 13: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. శనివారం వరుసగా నాలుగో రోజు వేలాది మంది ప్రజలు అమెరికా వీధుల్లోకి వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎలుగెత్తారు. లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, చికాగో వంటి పెద్ద నగరాలతో పాటు వార్సెస్టర్, మసాచ్యుసెట్స్, లోవా సిటీ వంటి చిన్న నగరాల్లో సైతం సాగిన ఈ నిరసన ప్రదర్శనలు చాలా మేరకు ప్రశాంతంగానే జరిగాయి. అయితే ఇండియానాపోలిస్‌లో నిరసన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. న్యూయార్క్‌లోని యూనియన్ స్క్వేర్ వద్ద నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించిన ఆందోళనకారులు ఫిఫ్త్ ఎవెన్యూ మీదుగా ట్రంప్ టవర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు బ్యారికేడ్లతో అడ్డుకున్నారు. దేశంలో అధికార మార్పిడి గురించి ట్రంప్ తన అపార్ట్‌మెంట్‌లో అనుచరులతో చర్చిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిష్ఠించరాదని డిమాండ్ చేస్తున్న సినీ నిర్మాత మైఖేల్ మూర్, ఫ్యాషన్ డిజైనర్ నొయేమీ అబాడ్ (30) సహా పలువురు ప్రముఖులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ట్రంప్‌కు నాటో చీఫ్ హెచ్చరిక
అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి (నాటో) పట్ల ట్రంప్ అనుసరించబోయే వైఖరి పట్ల సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నాటో నుంచి విడిపోయి ఒంటరిగా సాగడం అటు అమెరికాకు గానీ, ఇటు యూరప్‌కు గానీ మంచిది కాదని నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్ స్టోల్టెన్‌బెర్గ్ ఆదివారం ట్రంప్‌ను హెచ్చరించారు. నాటోకు కాలం చెల్లిపోయిందని, అమెరికాకు సుంకాలు చెల్లించని నాటో సభ్య దేశాలకు ఎటువంటి సహాయాన్ని అందించాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసిన నేపథ్యంలో స్టోల్టెన్‌బెర్గ్ ఈ హెచ్చరిక చేశారు. భద్రతా పరంగా ప్రస్తుతం అమెరికా సహా పాశ్చాత్య దేశాలు పెను ముప్పును ఎదుర్కొంటున్నాయని బ్రిటన్‌కు చెందిన ‘అబ్జర్వర్’ వార్తా పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో స్టోల్టెన్ బెర్గ్ పేర్కొన్నారు.

చిత్రం.. లాస్ వేగాస్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్న దృశ్యం