అంతర్జాతీయం

160 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయో, డిసెంబర్ 11: నైజీరియాలో నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కుప్పకూలిన దుర్ఘటనలో 160మంది మరణించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. దక్షిణ నైజీరియాలోని ఉయోలోగల రీయినర్స్ బైబిల్ చర్చిలో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో దాని పైకప్పు కుప్పకూలిపోయింది. నిర్మాణ లోపమే ఇందుకు కారణమా అన్న అంశంపై దర్యాప్తు జరిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆదివారం సాయంత్రం వరకూ 60 మృత దేహాలను వెలికి తీశారు. ఇంకా శిధిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సహాయ బృందాలు తెలిపాయి. నైజీరియాలో నిర్మాణంలో ఉన్న భవనాలు కుప్పకూలివడం తరచు జరుగుతుందని..అధికారులకు లంచాలు చెల్లించే కాంట్రాక్టర్లు నాసిరకం పరికరాలను వాడటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. నైజీరియా వాణిజ్య రాజధాని లాగోస్‌లో రెండేళ్ల క్రితం బహుళ అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో 116మంది మరణించారు. కాంట్రాక్టర్లపై కేసులు దాఖలు చేసినా ఇప్పటి వరకూ ఎవరికీ శిక్ష పడ్డ దాఖలాలు లేవు. నిర్మాణ లోపం వల్లే ఆ ఘటన జరిగిందన్న విషయం అనంతరం జరిగిన దర్యాప్తులో నిర్ధారితమైంది.