అంతర్జాతీయం

నా ప్రసంగం కాపీ కొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 24: పాకిస్తాన్ అధ్యక్షుడు మెమ్నూన్ హుస్సేన్‌పై ఓ చిత్రమైన కేసు దాఖలైంది. దేశాధ్యక్షుడు తన ప్రసంగాన్ని కాపీ కొట్టారంటూ 11 ఏళ్ల బాలుడు కోర్టును ఆశ్రయించాడు. ఆరో తరగతి విద్యార్థి మహ్మద్ సబీల్ హైదర్ తరఫున అతడి తండ్రి నసీం అబ్బాస్ నజీర్ ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ వేశాడు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా జయంతి కార్యక్రమంలో అధ్యక్షుడు చేసిన ప్రసంగం తనదేనని బాలుడు వాదిస్తున్నాడు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి అమీర్ ఫరూక్ తీర్పును వాయిదా వేశారు.
హైదర్ ఇస్లామాబాద్ మోడల్ స్కూల్‌లో ఆరోతరగతి చదువుతున్నాడు. గత మార్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థి చేసిన ప్రసంగం దేశాధ్యక్షుడి ప్రశంసలు అందుకుంది. ఈ మేరకు అధ్యక్ష భవనం నుంచి ప్రశంసాపత్రం అందజేశారు. జిన్నా 141 జయంతి సందర్భంగా ఏర్పాటవుతున్న కార్యక్రమంలో ప్రసంగించాలని విద్యార్థికి ఆహ్వానం అందింది. డిసెంబర్ 14 హైదర్ ప్రసంగించగా 22న రికార్డు చేశారు. రిహార్సిల్స్‌కూ హాజరయ్యాడు. ఇలాఉంటే ఐవాన్ ఎ సదర్ (అధ్యక్ష భవనం) యంత్రాంగం తీరు 11ఏళ్ల చిన్నారిని షాక్‌కు గురిచేసింది. రికార్డు చేసిన ప్రసంగం ఓ బాలికదని చెప్పారు. తన ప్రసంగాన్ని కాపీ చేయడమేకాకుండా అనుమతి లేకుండా తస్కరించారని బాలుడు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అధ్యక్షుడు, అధ్యక్ష భవనం సచివాలయం అదనపుకార్యదర్శి, ఉన్నత విద్య డైరెక్టరేట్, పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా, పాక్ టెలివిజన్ ఎండి, ఇస్లామాబాద్ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశాడు.