అంతర్జాతీయం

అక్రమంగా ఉంటున్నావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 28: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో 30 ఏళ్ల పైగా అమెరికాలో ఉంటున్న ఓ భారతీయ మహిళ నడుచుకొంటూ వెళ్తుండగా పోలీసులు ఆపి ఆమె ఇమిగ్రేషన్ హోదా గురించి ప్రశ్నించిన ఉదంతం వెలుగు చూసింది. గత డిసెంబర్ 21న జరిగిన ఈ సంఘటన వివరాలను ‘బాల్టిమోర్ సన్’ అనే పత్రిక ప్రచురించింది. ఆ రోజు ఉదయం 47 ఏళ్ల అరవింద పిల్లలమర్రి తాను ఉంటున్న బెల్ ఎయిర్ నైబర్‌హుడ్ ప్రాంతంలో రోజులాగే నడుచుకుంటూ వెళ్తుండగా స్థానిక పోలీసు అధికారి ఆమెను ఆపేసి ఏం చేస్తున్నావని ప్రశ్నించగా, నడుస్తున్నట్లు ఆమె సమాధానం చెప్పింది. అక్కడితో ఆగకుండా ఆ ఆఫీసర్ పలు ప్రశ్నలు వేస్తుండడంతో ఎందుకు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారని ఆమె అతడిని అడిగారు. దానికి అతను ఎవరో పోలీసులకు ఫోన్ చేశారని చెప్పాడు. ఈ లోగా ఓ పోలీసు సూపర్వైజర్ అక్కడికి రావడంతో ఆ పోలీసు అధికారి మరింత బెదిరింపు ధోరణిలో ఆమెను ప్రశ్నించసాగాడు. మీరు క్రిమినల్ ఇనె్వస్టిగేషన్‌లో ఉన్నారు గనుక ఇక్కడినుంచి వెళ్లడానికి వీల్లేదని కూడా చెప్పాడు. ‘నీ దగ్గర ఐడి (గుర్తింపు కార్డు) ఎందుకు లేదు’ అని ప్రశ్నించిన పోలీసు సూపర్వైజర్ ఇక్కడ అక్రమంగా ఉంటున్నావా అని అడిగాడని అరవింద చెప్పారు. ఆ ఆఫీసర్లు కంప్యూటర్లో తన పేరు కొట్టి చూసుకున్న తర్వాత మాత్రమే తనను వెళ్లడానికి అనుమతించారని, దీంతో హమ్మయ్య అని అనుకుంటూ కేవలం కొద్ది అడుగుల దూరంలోనే ఉన్న ఇంటికి చేరుకున్నానని ఆమె తెలిపింది.