అంతర్జాతీయం

యెమెన్‌లో అమెరికా దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెన్, జనవరి 29: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికా సైన్యాలు యెమెన్‌లో పెద్దఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 41మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. 16మంది సాధారణ పౌరులు మరణించారు. చనిపోయిన పౌరుల్లో 8మంది మహిళలు, 8మంది పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. యాక్లా జిల్లాలో అల్‌ఖైదా మిలిటెంట్లు వైద్యసహాయంకోసం వినియోగించే ఓ భవంతితోపాటు, ఓ మసీదు, పాఠశాలలపై అమెరికా అపాచే హెలికాప్టర్లు బాంబులతో విరుచుకుపడ్డాయి. చనిపోయిన వారిలో ముగ్గురు కీలక ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
ఈ ప్రాంతంలో అల్‌ఖైదా చీఫ్‌గా భావిస్తున్న అబు బరాజన్ కూడా మరణించాడని పేర్కొన్నాయి. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ దాడులు జరిగాయి. అల్‌ఖైదాకు చెందిన యెమెన్ ప్రాంచైజీ చాలా ప్రమాదకరంగా మారిందని తెలిపాయి. 2015 నుంచి ఇప్పటివరకు యెమెన్ సంక్షోభంలో కనీసం 7400మంది మరణించారు.