అంతర్జాతీయం

మీ క్షేమం.. నా బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 4: తాను జారీ చేసిన వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా సమర్థించుకున్నారు. దీనివల్ల టెర్రరిస్టులు దేశంలోకి అడుగుపెట్టలేరని, అమెరికన్లను సురక్షితంగా, స్వేచ్ఛగా ఉంచడం తన బాధ్యత అని కూడా ఆయన చెప్పారు. ‘మిమ్మల్ని క్షేమంగా, స్వేచ్ఛగా ఉంచాలనే నా బాధ్యతను ఎప్పటికీ మరిచిపోను’ అని ట్రంప్ ప్రతివారం జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో అన్నారు. అందువల్లనే తాను గత వారం టెర్రరిస్టులను దేశానికి బయట ఉంచే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశానని అన్నారు. ‘అమెరికాలోకి వచ్చే వారు మన ప్రజలను ప్రేమించే, సమర్థించేవారుగా ఉండేలా చూసేందుకు అవసరమైన కొత్త తనిఖీలు, వ్యవస్థలను అభివృద్ధి చేసే ప్రక్రియను ఈ ఉత్తర్వు ఏర్పాటు చేస్తుంది’ అని ట్రంప్ చెప్పారు. అంతేకాదు ప్రతి విషయంలోను తన ప్రభుత్వం అమెరికా కార్మికులకు, కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పని చేస్తుందని కూడా ఆయన చెప్పుకొన్నారు. జనవరి నెలలో ప్రైవేట్ రంగంలో కొత్తగా 2,37,000 ఉద్యోగాలు వచ్చాయని, ఇది అందరి అంచనాలకు మించి ఉందని కూడా అన్నారు.
60 వేల వీసాలు రద్దు
ఏడు ముస్లిం మెజారిటీ దేశాల ప్రజలకు అమెరికా ప్రయాణంపై నిషేధం విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత 60 వేలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరాక్, సిరియా, సూడాన్, ఇరాన్, సోమాలియా, లిబియా, యెమన్ దేశాలకు చెందినవారు అమెరికాలోకి ప్రవేశించకుండా 90 రోజులపాటు నిషేధం విధించే ఉత్తర్వుపై ట్రంప్ గత వారం సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు కింద 60 వేలకు పైగా వ్యక్తుల వీసాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు విదేశాంగ శాఖలో కాన్సులర్ వ్యవహారాల బ్యూరో ప్రతినిధి విల్ కాక్స్ చెప్పారు. కాగా, ఈ నిషేధం చట్టబద్ధంగా శాశ్వతంగా నివసిస్తున్న వారికి, జాబితాలో పేర్కొన్న ఏడు దేశాలు కాకుండా ఇతర దేశం పాస్‌పోర్టుతో ద్వంద్వ పౌరసత్వం కలవారు, దౌత్యపరమైన, నాటో లేదా ఐక్యరాజ్య సమితి వీసాలపై ప్రయాణించే వారికి వర్తించదని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.
ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ
ఏడు మెజారిటీ ముస్లిం దేశాలనుంచి వచ్చే శరణార్థులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ సియాటిల్‌కు చెందిన జిల్లా జడ్జి జోమ్స్ రాబర్ట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు దేశమంతటా వర్తిస్తాయని కూడా న్యాయమూర్తి తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. కాగా, ఈ ఉత్తర్వులను దేశవ్యాప్తంగా నిలిపివేయాలని వాషింగ్టన్, మినె్నసోటా రాష్ట్రాలు కోరాయి.

చిత్రం..ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన ప్రతిని చూపుతున్న డొనాల్డ్ ట్రంప్