అంతర్జాతీయం

ఆంక్షలకు వ్యతిరేకంగా లండన్‌లో ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాల ప్రజలు ఆ దేశంలోకి ప్రవేశించకుండా విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ లండన్‌లో వేలాది మంది ప్రజలు శనివారం వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ట్రంప్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరుతూ పంపించిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకోవలసిందిగా వారు బ్రిటన్ ప్రధాని థెరిసా మేను కోరారు. స్టాప్ ద వార్ కొయలీషన్, స్టాండప్ టు రేసిజం, ముస్లిం అసోసియేషన్ ఆఫ్ బ్రిటన్ మొదలగు సంస్థలు ఈ ప్రదర్శన నిర్వహించాయి. సెంట్రల్ లండన్‌లోని అమెరికా ఎంబసీ నుంచి మొదలయిన ఈ ప్రదర్శన డౌనింగ్ స్ట్రీట్ వద్ద ముగిసింది. ‘నో టు ట్రంప్, నో టు వార్’, ‘అమెరికన్ సైకో’ అనే కాప్షన్‌తో గల ట్రంప్ చిత్రాలు ఉన్న ప్లకార్డులను ప్రదర్శకులు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో పలువురు వక్తలు బ్రిటన్ పర్యటన కోసం ట్రంప్‌కు పంపించిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధాని థెరిసా మేను కోరారు.