అంతర్జాతీయం

ఏదైనా జరిగితే మీదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 6: ముస్లిం దేశాల పౌరుల పర్యటనలపై తాను విధించిన నిషేధాన్ని నిలిపివేసిన న్యాయ వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. దేశంలో జరుగకూడనిది ఏదైనా జరిగితే అందుకు అమెరికన్లు తప్పుబట్టాల్సింది తన ఆదేశాలపై స్టే ఇచ్చిన న్యాయమూర్తిని, కోర్టులనేనని స్పష్టం చేశారు. 90రోజుల పాటు ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు దేశంలోకి రాకూడదంటూ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల అమలును నిలిపేసిన శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా న్యాయమూర్తి జేమ్స్ రోబర్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్వులో భాగంగా శరణార్థులందరిపైనా 120 రోజుల పాటు, సిరియాకు చెందిన వారిపై శాశ్వతంగా ట్రంప్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి రోబర్ట్ తీర్పుపై మండిపడుతూ ట్వీట్ చేసిన ట్రంప్ ‘ఓ జడ్జి మొత్తం దేశానే్న ప్రమాదంలో పడేయడం నమ్మశక్యం కావడం లేదు. ఒక వేళ ఏదైనా జరిగితే అందుకు ఆ న్యాయమూర్తిని, కోర్టునే నిందించండి’అని అమెరికన్లకు స్పష్టం చేశారు. దేశంలోకి ప్రవేశించే వారిని చాలా జాగ్రత్తగా తనిఖీ చేయాలని కోర్టు ఆదేశం నేపథ్యంలో హోం ల్యాండ్ అధికారులకు స్పష్టం చేశానని వివరించారు. ప్రభుత్వం తన బాధ్యతలు నిర్వర్తించడాన్ని కోర్టులు సంక్లిష్టంగా మారుస్తున్నాయని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల ముప్పు నుంచి అమెరికాను రక్షించడానికి ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విధించడం అనివార్యంగా మారిందని వివరించారు. ట్రంప్ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై అమెరికా పౌరుల నుంచే కాదు, దాని మిత్ర దేశాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.