అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 23: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటనలు కలకలం సృష్టించాయి. తాజాగా రెండు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు కాల్పుల సంఘటనల్లో మొత్తం 14 మంది మృతి చెం దారు. ఓహియో గ్రామీణ ప్రాంతంలో ఒక టీనేజర్ సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని కాల్చి చంపారు. తరువాత జార్జియాలో ఓ సాయుధ దుండగుడు అయిదుగురిని కాల్చి చంపాడు. ఓహియోలో పక్కపక్కనే ఉన్న మూడిళ్ల నుంచి ఏడు మృతదేహాలను, ఆ తరువాత మరో ప్రదేశంలో మరో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఎనిమిది మంది ఒక కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల్లో 16 ఏళ్ల బాలుడు మినహా మిగతా వారంతా పెద్దలేనన్నారు. ఈ కాల్పుల ఘటన నుం చి ముగ్గురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కాల్పులకు దారితీసిన పరిస్థితులు తెలియరాలేదు. ఒకరిని అనుమానితుడిగా భావిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు చెప్పారు. బాధితుల్లో ప్రతి ఒక్కరినీ తలలో కాల్చి చంపినట్టు కనపడుతోందని ఓహియో అటార్నీ జనరల్ మైక్ డివైన్ తెలిపారు.