అంతర్జాతీయం

‘పాస్‌వర్డ్’ చెబితేనే ఇకపై అమెరికా వీసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 9: అమెరికాను సందర్శించడానికి వీసాలకోసం దరఖాస్తు చేసుకునే విదేశీ ప్రయాణికులు ఇకపై అధికారులకు తమ సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీ సందర్శకుల తనిఖీలను మరింత కఠినం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకోవాలని అనుకుంటున్నట్లు అమెరికా ఆంతరంగిక భద్రతా మంత్రి జాన్ కెల్లీ అమెరికా ప్రతినిధుల సభకు చెందిన హోంలాండ్ సెక్యూరిటీ కమిటీకి తెలియజేశారు. అమెరికాకు వచ్చేవారి అదనపు స్క్రీనింగ్ కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగా వారి సోషల్ మీడియా వివరాలను పాస్‌వర్డ్‌లతోపాటుగా తీసుకోవచ్చని చెప్పారు.
‘ఆ ఏడు ముస్లిం దేశాలనుంచి వచ్చేవారిని నిజంగా క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటే చాలా కష్టమే.. అయితే వారు ఇక్కడికి వచ్చాక మీరు వాడుతున్న పాస్‌వర్డ్‌లు ఇమ్మని అడుగుతాం.. దానివల్ల వాళ్లు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారో చూడవచ్చు’ అని కెల్లీ మంగళవారం కమిటీ ముందు చెప్పారు. ‘ఒకవేళ వారు సహకరించకూడదని అనుకుంటే ఇక్కడికి రారు’ అని కూడా ఆయన చెప్పారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలనుంచి వచ్చే శరణార్థులు, వీసా దరఖాస్తుదారులను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి పరిశీలనలో ఉన్న అనేక ప్రతిపాదనల్లో ఇదొకటని కెల్లీ కమిటీ సభ్యులకు చెప్పినట్లు ‘ఎన్‌బిసి న్యూస్’ తెలిపింది.