అంతర్జాతీయం

సందీప్ దాస్ ఆల్బంకు ‘గ్రామీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, ఫిబ్రవరి 13: భారతీయ తబ్లా ప్లేయర్ సందీప్ దాస్‌తో కలిసి యో-యో మా రూపొందించిన ఆల్బం ‘సింగ్ మి హోం’ ప్రపంచ సంగీత విభాగంలో గ్రామీ పురస్కారాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కళాకారుల స్వరకల్పనతో కూడుకున్నది కావడం ‘సింగ్ మి హోం’ ప్రత్యేకత. ‘ద మ్యూజిక్ ఆఫ్ స్ట్రేంజర్స్: యో-యో మా అండ్ ద సిల్క్ రోడ్ ఎనె్సంబుల్’ శీర్షికతో మా రూపొందించిన ప్రాజెక్టుతో కలిసి ఈ ‘సింగ్ మి హోం’ ఆల్బంను విడుదల చేశారు. మా, దాస్‌లతోపాటు న్యూయార్క్‌లోని సిరియా సంతతికి చెందిన సన్నాయి వాయిద్యకారుడు కినన్ అజ్మేహ్ తదితరులు ఈ ఆల్బంకు తమ గాత్రాన్ని అందించారు. భారతీయ సితారిస్టు అనౌష్క శంకర్ స్వరకల్పన చేసిన ‘ల్యాండ్ ఆఫ్ గోల్డ్’ కూడా ఈ ప్రపంచ సంగీత విభాగంలోనే గ్రామీ పురస్కారానికి నామినేట్ అయినప్పటికీ, అవార్డును దక్కించుకోలేక పోయింది. అనౌష్క శంకర్‌ను ఆరోసారి దురదృష్టం వెంటాడింది. కొనే్నళ్లలో ఆరుసార్లు ఆమె ఆల్బంలు నామినేట్ అయినప్పటికీ, తుది పోటీల్లో విజేతగా నిలవలేకపోయాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఏడు ముస్లిం దేశాల నుంచి ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించిన సమయంలో కినన్ అజ్మేహ్ విదేశాల్లో చిక్కుకుపోయారు. అమెరికా న్యాయస్థానం ట్రంప్ ఆంక్షల అమలును నిలిపివేసిన తరువాతే ఆయన తిరిగి అమెరికాలోకి ప్రవేశించగలిగారు.
లాస్ ఏంజిలిస్‌లో ఎరుపు రంగు కుర్తా ధరించి గ్రామీ పురస్కారాన్ని స్వీకరించిన దాస్ తరువాత విలేఖరులతో మాట్లాడుతూ ఐక్యత, ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవడం అనే శక్తివంతమైన సందేశాన్ని తమ ఆల్బం పంపించిందని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను నేరుగా ప్రస్తావించకుండానే ‘ఇలాంటి సంఘటనలు మాలోని చాలామందిని నేరుగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే మాలోని చాలా మందిమి అలాంటి దేశాల నుంచి వచ్చిన వారమే’ అని దాస్ అన్నారు. ‘మమ్మల్ని అదృష్టం వరించడం ఇది మూడోసారి. నేనెవరిని, నేను ఏ సంస్కృతి, సంగీతం నుంచి వచ్చాను అనేది ఆలోచించినప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను. నా స్వంత దేశం (్భరత్) నుంచి సంగీతానికి మరింత గుర్తింపు వస్తుందనేది నా ఆకాంక్ష. ఎందుకంటే సంగీతం మా రక్తంలోనే ఉంది’ అని దాస్ లాస్ ఏంజిల్స్ నుంచి భారత్‌లో ఉన్న ఒక వార్తాసంస్థ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ అన్నారు.
గొప్ప విజేత అడెలె
59వ వార్షిక గ్రామీ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో బ్రిటన్‌కు చెందిన అడెలె అయిదు విభాగాలలో పురస్కారాలను అందుకొని, అందరికన్నా ఎక్కువ అవార్డులను గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. ఆల్బం ఆఫ్ ది ఇయర్, రికార్డ్ ఆఫ్ ది ఇయర్, సాంగ్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ పాప్ సోలో, బెస్ట్ పాప్ వోకల్ పురస్కారాలను ఆమె దక్కించుకున్నారు. అడెలెకు ఈ అయిదు పురస్కారాలను గెలుచుకోవడానికి ‘హలో’, ఆల్బం 25 దోహదపడ్డాయి. అడెలె గట్టి పోటీదారుగా ఉన్న బియోన్స్‌తో తలపడి ఈ అయిదు పురస్కారాలను గెలుచుకోవడం విశేషం. బియోన్స్ తన ‘లెమొనేడ్’తో తొమ్మిది విభాగాలలో గట్టి పోటీదారుగా నిలిచినప్పటికీ, రెండు విభాగాలలో మాత్రమే విజేతగా నిలిచారు. బెస్ట్ అర్బన్ కాంటెపరరీ ఆల్బం, బెస్ట్ మ్యూజిక్ వీడియో విభాగాలలో ఆమె గ్రామీ పురస్కారాలను సాధించారు.

చిత్రాలు..గ్రామీ అవార్డుతో తబ్లా ప్లేయర్ సందీప్ దాస్
*ఐదు అవార్డులు అందుకున్న అడెలె