అంతర్జాతీయం

ట్రంప్ ఏంచెబుతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, ఫిబ్రవరి 25: విద్వేష నేరాలను ఎలా ఆపుతారంటూ కాల్పుల ఘటనలో మరణించిన శ్రీనివాస్ భార్య సనయన దుమాల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గట్టిగా నిలదీసింది. అమెరికాలో శే్వత జాతీయుడి దురహంకారానికి తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల బలైపోయిన విషయం తెలిసిందే. మృతుడు శ్రీనివాస్ పనిచేసిన జిపిఎస్ పరికరాల తయారీ సంస్థ గార్మిన్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునయన మాట్లాడుతూ అమెరికాలో మైనారిటీలపై విద్వేష నేరాల నియంత్రణకు ట్రంప్ సర్కారు ఏంచేస్తుందో చెప్పాలని డిమాండ్ చేసింది. మైనారిటీలు వివక్షకు గురవుతున్నారన్న వార్తలు భయాందోళన కలిగిస్తున్నాయని, ఇదంతా చూస్తుంటే అసలు తాము ఈ ప్రాంతానికి చెందిన వారమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో తన భర్త మాదిరిగా మరెవరూ జాతి విద్వేష ఘాతుకానికి బలి కాకూడదని కోరుకుంటూ, మైనార్టీలపై దాడుల నియంత్రణకు ట్రంప్ సర్కారు ఎలాంటి చర్యలు చేపడుతుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. అధ్యక్షుడు ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే, ప్రతి ఒక్కరినీ అమెరికాకు హాని తలపెట్టేవారిగా భావించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది. శే్వత జాతీయులు మైనారిటీలపై తరచూ జాత్యహంకార కాల్పులకు తెగబడుతుంటం తీవ్ర ఆందోళన కలిగించేదని పేర్కొన్నారు. తమ కుటుంబం అమెరికాలో నివసించడం సరైనదేనా? అని ఎప్పుడూ సందేహించేదానినని, అయితే అమెరికాలో అంతా మంచే జరుగుతుందని శ్రీనివాస్ తనకు ధైర్యం చెప్పేవాడని ఆమె గుర్తు చేసుకున్నారు. అమెరికాకు వలస రాకుండా కొన్ని ముస్లిం దేశాల ప్రజలపై నిషేధం విధించడంతోపాటు, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణ ఎన్నికల హామీ నెరవేర్చాలని చూస్తున్న ట్రంప్ ప్రణాళికలకు లక్ష్యంగా మారుతున్నామన్న ఆందోళన మైనారిటీల్లో ఉందని, శ్రీనివాస్ మరణంతో వారి భయాందోళనలు రెట్టింపయ్యాయని సునయన వ్యాఖ్యానించారు. టెక్సాస్ వర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ కోసం 2005లో అమెరికా వచ్చిన శ్రీనివాస్, కాన్సాస్ సిటీకి మకాం మార్చడానికి ముందు లోవాలో ఆరేళ్లు పనిచేశారని వివరించింది.
ఇదిలావుంటే, హ్యూస్టన్‌లోని భారత కాన్సల్ జనరల్ అనుపమ్ రే ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయనతోపాటు కాన్సాస్ ఓలత్ ఏరియాలోని ప్రవాస భారతీయులు బాధిత కుటుంబానికి సాధ్యమైన సహాయాన్ని అందిస్తున్నారు. శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే ఈ విషాద సమయంలో అతని కుటుంబానికి అండగా నిలిచేందుకు డిప్యుటీ కాన్సల్ ఆర్‌డి జోషి, వైస్ కాన్సల్ హెచ్ సింగ్‌ను హుటాహుటిన కాన్సాస్‌కు పంపామని అనుపమ్ రే పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తాము శ్రీనివాస్ కుటుంబం వెంటే ఉన్నామని, అన్నివిధాలా సాధ్యమైన సాయం అందిస్తామని సునయనకు హామీ ఇచ్చినట్టు చెప్పారు.
మరోవైపు ఓలత్ ఏరియాలోని ప్రవాస భారతీయులను జోషి కలసి కాల్పుల ఘటనలో గాయపడిన మరో భారతీయుడు అలోక్ మాదసాని ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. అలోక్‌ను ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అలోక్‌తోపాటు ఘటనలో గాయపడిన అమెరికన్‌వాసి ఇయాన్ గ్రిల్లోట్ (24) ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని కాన్సాస్ వర్శిటీ హాస్పిటల్ అధికార ప్రతినిధి తెలిపారు.

చిత్రాలు..మీడియాతో మాట్లాడుతున్న సునయన

*హైదరాబాద్‌లోని అమెరికా కాన్స్‌లేట్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు ట్రంప్‌నకు నిరసన తెలుపుతున్న ప్రజలు