అంతర్జాతీయం

ఆస్కార్ వేడుకలో ఓం పురికి నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజెల్స్, ఫిబ్రవరి 27: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్‌కు చెందిన దివంగత విశిష్ట నటుడు ఓం పురిని స్మరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’, ‘గాంధీ’, ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘ఉల్ఫ్’ తదితర చిత్రాల్లో విశిష్టమైన నటనతో అందరినీ మెప్పించి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన ఓం పురి (66) ఈ ఏడాది జనవరిలో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఓం పురితో పాటు ‘స్టార్ వార్స్’ చిత్ర నటి కారీ ఫిషర్, ఆమె తల్లి డెబ్బీ రెనాల్డ్స్, బిల్ పాక్స్‌టన్ తదితరులను కూడా ఈ సందర్భంగా స్మరించుకుని సినీ రంగానికి వారు చేసిన విశిష్ట సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. వీరందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రూపొందించిన స్వల్ప వీడియోను జెన్నిఫర్ అనిస్టన్ ఉద్వేగ భరితంగా ప్రారంభించి, శనివారం కన్ను మూసిన బిల్ పాక్స్‌టన్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ వీడియోలో బిల్ నన్, జార్జ్ కెనడీ, జీన్ విల్డర్, పాటీ డ్యూక్, గారీ మార్షల్, ఆంటోన్ యెల్చిన్, మేరీ టేలర్ మూర్, ప్రిన్స్, జాన్ హర్ట్, నాన్సీ రీగన్, కర్టిస్ హన్సన్ తదితర సినీ ప్రముఖలకు కూడా చోటు కల్పించారు.