అంతర్జాతీయం

బ్రెగ్జిట్ బిల్లుపై ప్రధానికి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 2: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన (బ్రెగ్జిట్) తరువాత తీసుకోవలసిన చర్యలపై దేశ ప్రధానమంత్రి థెరిసా మేకు ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగిన తరువాత బ్రిటన్‌లో ఉన్న ఇయు పౌరుల నివాసానికి సంబంధించిన హక్కులకు హామీ కల్పించాలని బిల్లుకు ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా ఎగువ సభ ఓటు వేసింది. ప్రధాని మేకు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి ఎగువ సభలో మెజారిటీ లేనందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇయు సభ్యులకు ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న నివాస హక్కులకు బ్రెగ్జిట్ తరువాత ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఉండేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వం మూడు నెలలలోగా చేయవలసిన పరిస్థితి ఈ సవరణ ఆమోదం వల్ల ఏర్పడింది. ఇయు నుంచి వైదొలగాలని ప్రజలు ఇచ్చిన రెఫరెండం తీర్పునకు చట్టరూపం కల్పించడానికి ప్రవేశపెట్టిన బిల్లుపై ఎగువ సభలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అయితే ఈ బిల్లు తిరిగి దిగువ సభ (ప్రజాప్రతినిధుల సభ)కు చర్చకు వచ్చినప్పుడు దిగువ సభ ఈ సవరణను తిరస్కరించే అవకాశం ఉంది. దిగువ సభలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి మెజారిటీ ఉంది. దిగువ సభ ఇదివరకే యూరోపియన్ యూనియన్ (నోటిఫికేషన్ ఆఫ్ విత్‌డ్రావల్) బిల్లును ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించింది. ఈ నెలలో తిరిగి దిగువ సభలో ఓటింగ్ జరిగేటప్పుడు ఎగువ సభ చేసిన సవరణలను తొలగించే అవకాశం ఉంది. ఈ బిల్లు తిరిగి ఈ నెల 13, 14 తేదీలలో తిరిగి దిగువ సభకు వస్తుంది. ప్రతినిధుల సభ చేసిన సవరణలను ఉంచాలా? తొలగించాలా? అనే అంశంపై ఎంపీలు చర్చిస్తారు.