అంతర్జాతీయం

వ్యూహాత్మక బంధాన్ని ముందుకు తీసుకెళ్లేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 2: ఇండో-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను ప్రత్యేకించి వాణిజ్య, రక్షణ, భద్రత రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి అనుసరించాల్సిన మార్గాలపై భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ఈ మేరకు అమెరికా జాతీయ భద్రత సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ సహా ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఉన్నత స్థాయి మిలిటరీ నాయకుడయిన మెక్‌మాస్టర్‌ను జాతీయ భద్రత సలహాదారుగా అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పది రోజుల క్రితం నియమించిన విషయం తెలిసిందే. అమెరికా కొత్త జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన మెక్‌మాస్టర్‌తో జైశంకర్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌లో సమావేశమైన ఈ ఇద్దరు నేతలు భద్రత, కౌంటర్ టెర్రరిజం, రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలపై చర్చించి ఉంటారని భావిస్తున్నారు. జైశంకర్ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ ర్యాన్‌తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించవలసిన మార్గాలు సహా వివిధ అంశాలపై పౌల్ ర్యాన్‌తో జైశంకర్ చర్చించారు. ‘అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు ఇరు దేశాల ప్రజాస్వామిక విలువలు, స్వేచ్ఛలలో పాతుకొని ఉన్నాయి’ అని సమావేశానంతరం ర్యాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మా ఆర్థిక, రక్షణ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించవలసిన మార్గాలపై చర్చించడం ద్వారా లోతయిన పటిష్ఠమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడానికి మేము ఈ రోజు గొప్ప అవకాశాన్ని కలిగి ఉన్నాము’ అని ఆయన పేర్కొన్నారు. జైశంకర్‌తో సమావేశం సందర్భంగా ర్యాన్ ఇటీవల సంభవించిన భారతీయ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల మృతి పట్ల అమెరికా ప్రతినిధుల సభ తరపున సంతాపాన్ని తెలిపారు. ‘మా ప్రజలు కలసి నిలబడటాన్ని కొనసాగించి తీరుతారు. రానున్న రోజుల్లో విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌తో కలిసి పనిచేస్తాను’ అని ర్యాన్ పేర్కొన్నారు. జైశంకర్ నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం మంగళవారం ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే.