అంతర్జాతీయం

మళ్లీ నిషేధ సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీటిల్, మార్చి 10:ఆరు ముస్లిం దేశాలకు చెందిన వలసదారులు, శరణార్థులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. 50వ రాష్ట్రంగా ఉన్న హవాయ్ ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ తొలి అడుగు వేస్తే తాజాగా వాషింగ్టన్ రాష్ట్రం కూడా అదే బాటలో ముందుకొచ్చింది. ట్రంప్ తాజా కార్యనిర్వాహక ఉత్తర్వును నిలిపివేయాలని కోరతామని వాష్టింగన్ ప్రకటిస్తే..ఇందుకు ఓరియోన్ రాష్ట్రానికి న్యాయమూర్తి అనుమతి లభించింది. న్యాయస్థానాల్లో ట్రంప్ ఉత్తర్వును
ఎదుర్కోవాలన్న తమ వాదనతో న్యూయార్క్ రాష్ట్రం కూడా ఏకీభవిస్తోందని వాష్టింగ్టన్ అటార్నీ బాబ్ ఫెర్గ్యూసన్ తెలిపారు. తామూ న్యాయపోరాటానికి సిద్ధమేనని మసాచుసెట్స్ అటార్నీ జనరల్ వౌరా హేలీ ప్రకటించారు. ట్రంప్ తొలి ఉత్తర్వును మొదట వ్యతిరేకించింది వాష్టింగ్టన్ రాష్టమ్రే..దాని ఫలితంగానే దేశ వ్యాప్తంగా పర్యాటక నిషేధం అమలుకు బ్రేకు పడింది. ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులో కొత్తదనం ఏమీ లేదని, పాత కార్యనిర్వాహక ఆదేశంలోని అనేక చట్ట వ్యతిరేక అంశాలు ఇందులోనూ ఉన్నాయని ఫెర్గ్యూసన్ తెలిపారు. ట్రంప్ ఆదేశం పట్ల తాము వౌనంగా ఉండలేమని, వైవిధ్యభరితైన సంస్కృతి, చరిత్ర కలిగిన తమ రాష్ట్రం ఆర్థికంగా పర్యాటకులపైనే ఆధార పడి ఉందని హవాయి అటార్నీ జనరల్ డోగ్లాస్ చిన్ తెలిపారు. తాము జారీ చేసిన కొత్త ఉత్తర్వు చట్టపరమైన అన్ని పరీక్షలనూ ఎదుర్కోగలుగుతుందని ట్రంప్ ప్రభుత్వం గట్టిగా చెబుతున్నప్పటికీ ఒకదాని తర్వాత ఒకటిగా కనెక్టికట్, ఇలినోయిస్, లోవా,మేరీలాండ్, న్యూమెక్సికో, పెన్సిలేనియా, వెర్మంట్, వర్జినియా రాష్ట్రాలూ నాయ పోరాటానికి సన్నద్ధం కావడంతో గందరగోళ పరిస్థితులు అనివార్యంగా కనిపిస్తున్నాయి.