అంతర్జాతీయం

బ్రిటీష్ పార్లమెంటుపై దాడి మా ప్రతాపమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 23:బ్రిటన్ పార్లమెంటుపై బుధవారం దాడి మా ప్రతాపమేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చెప్పుకొంది. కాగా పార్లమెంటుపై దాడి చేసిన వ్యక్తి బ్రిటన్‌లోనే జన్మించాడని, గతంలో నిఘా సంస్థలు అతడిని ఒక సారి ప్రశ్నించాయని బ్రిటీష్ ప్రధాని థెరెసా మే స్పష్టం చేశారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి లండన్, బర్మింగ్ హామ్‌లలో జరిపిన దాడుల్లో భద్రతా సిబ్బంది ఎనిమిది మందిని అరెస్టు చేశారు. బుధవారం పార్లమెంటుపై జరిగిన దాడిలో ఉగ్రవాది సహా నలుగురు చనిపోగా, 40 మంది దాకా గాయపడిన విషయం తెలిసిందే. బుధవారం దాడి తర్వాత తాత్కాలికంగా నిలిచిపోయిన బ్రిటీ ష్ పార్లమెంటు సమావేశాలు గురువారం తిరిగి ప్రారంభమయ్యాయి. దాడికి సంబంధించి ప్రధాని థెరెసా మే పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ, దాడి చేసిన వ్యక్తి బ్రిటన్‌లో జన్మించిన వాడే. కొనే్నళ్ల క్రితం ఎంఐ 5 (బ్రిటన్ మిలిటరీ ఇంటెలిజన్స్ ఏజ న్సీ) హింసాత్మక తీవ్రవాదానికి సం బంధించి అతడిని ప్రశ్నించింది’ అని తెలిపారు. ఈ సమయంలో మ న విలువలదే విజయమని, ఉగ్రవాదులు విజయం సాధించలేరనే విషయాన్ని నిరూపించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. లండన్ నడిబొడ్డున ఉన్న వెస్ట్‌మినిస్టర్‌పై దాడికి బాధ్యత తమదేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తమ ప్రచార వార్తాసంస్థ ‘అమక్’లో ప్రకటించుకొంది. ఐఎస్ సైనికుడొకడు ఈ దాడి జరిపాడని ఆ సంస్థ తెలిపింది. సిరి యా, ఇరాక్‌లలో తమ స్థావరాలపై దాడులు చేస్తున్న సంకీర్ణ దళాలలో ఉండే దేశాల ప్రజలు, భద్రతా దళాలపై దాడులు జరపాలని తాము ఇచ్చిన పిలుపుమేరకే ఈ దాడి జరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

చిత్రం..ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పిస్తున్న బ్రిటన్ పార్లమెంట్