అంతర్జాతీయం

కొత్త జిహాదీ జాన్ సిద్ధార్థ ధర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 2: భారతీయ సంతతికి చెందిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాది సిద్ధార్థ ధర్ కొత్త జిహాదీ జాన్ (సీనియర్ కమాండర్)గా వ్యవహరిస్తున్నట్లు మీడియా వార్తలు వెల్లడిస్తున్నాయి. నిహాద్ బరాకత్ అనే యువతిని సిద్ధార్థ అపహరించుకుపోయి ఐసిస్‌లో సెక్స్ బానిసగా మార్చినట్లు ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది. బ్రిటిష్ హిందూ అయిన సిద్ధార్థ ఇస్లాంలోకి మారిపోయి అబు రుమేసా పేరుతో యూకే నుంచి సిరియాకు 2014లో భార్యాపిల్లలతోసహా పారిపోయాడు. యూకేలోని బ్రిటిష్ ముస్లిం టీవీ ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీలో బరాకత్ అనేక విషయాలను వెల్లడించింది. తనను ఇరాక్‌లోని కిర్కుక్‌లో బంధించారని.. మోసుల్ నుంచి వచ్చిన మరో నాయకుడు అబుధర్ అప్పగించారని పేర్కొంది. బ్రిటన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబుధర్ అని బ్రిటన్ పత్రిక వెల్లడించింది. సిద్ధార్థ ఇప్పుడు జిహాదీ జాన్‌గా ప్రసిద్ధి చెందిన మహమ్మద్ ఎమ్వాజీ స్థానంలో బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు.