అంతర్జాతీయం

కొలంబియాలో తుపాను బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొకోవా, ఏప్రిల్ 2: కొలంబియాలో శుక్రవారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షాలకు మొకోవా పట్టణంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య గంట గంటకు పెరిగి పోతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 250కి పైగా దాటిపోగా, శిథిలాల కింద పెద్ద సంఖ్యలో శవాలు బైటపడుతుండడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. మరోవైపు క్షతగాత్రుల సంఖ్య కూడా వేలల్లోకి చేరుకుంటోంది. 234 మంది చనిపోగా, మరో వందమందికి పైగా జాడతెలియడం లేదని కొలంబియా రెడ్‌క్రాస్ ప్రకటించింది. రెండు రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి వచ్చిన ఆకస్మిక వరదలకు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డంతో 40 వేలకు పైగా జనాభా ఉండే మొకోవా పట్టణం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. తెల్లవారి లేచి చూసే సరికి ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపించాయని ప్రాణాలతో బైటపడిన ఓ వ్యక్తి చెప్పాడు. పట్టణ మేయర్ నివాసం కూడా ఈ వరదల్లో కొట్టుకు పోయింది. మొకోవా పట్టణంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కొలంబియా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పట్టణంలో విద్యుత్‌తో పాటుగా నిత్యావసరాలు, తాగు నీరు కూడా లేకపోవడంతో జనాలు దుకాణాలను లూటీ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఎక్కించడానికి కూడా రక్తం దొరక్క డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. కొలంబియా దుర్ఘటన పట్ల పోప్ ఫ్రాన్సిస్ సైతం సంతాపం వ్యక్తం చేశారు. కాగా, నెలలో సగటున కురిసే వర్షపాతంలో 30 శాతం ఒక్క శుక్రవారం రాత్రి కురిసిందని, అందుకే ఈ ఆకస్మిక వరదలు సంభవించాయని ఐరాస అధికారులు అంటున్నారు. సైనికులు, స్థానిక పోలీసులతో సహా వెయ్యి మందికి పైగా ఎమర్జెన్సీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.