అంతర్జాతీయం

పారిస్ వాతావరణ ఒప్పందం అమెరికాకు మంచిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 3: పారిస్‌లో కుదిరిన చరిత్రాత్మక వాతావరణ ఒప్పందం అమెరికాకు ఏమాత్రం మంచిది కాదని, భారత్, చైనా లాంటి దేశాలకు అనుకూలమైన ఈ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని కలిగించేదిగా ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ వాతావరణ మార్పులపై అంతర్జాతీయ సమాజం చర్చలు కొనసాగించాల్సిందేనని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఇపిఎ) పాలనాధికారి స్కాట్ ప్రుయిట్ స్పష్టం చేసినట్లు ‘్ఫక్స్ న్యూస్’ వార్తా సంస్థ పేర్కొంది. ‘వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలను కొనసాగించడం ఎంతో ముఖ్యం. పారిస్‌లో కుదిరిన వాతావరణ ఒప్పందం చైనాతో పాటు భారత్‌కు ఎక్కువ ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు భారత్, చైనా 2030 సంవత్సరం వరకు చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో మిగిలిన ప్రపంచ దేశాల కంటే భారత్, చైనా ఎంతో నిబద్ధతతో ఉన్నాయని ఎవరైనా అనుకుంటే ఆ అభిప్రాయం పూర్తిగా తప్పన్నది నా భావన’ అని ప్రుయిట్ పేర్కొన్నట్లు ‘్ఫక్స్ న్యూస్’ వెల్లడించింది.