అంతర్జాతీయం

ట్రంప్ యంత్రాంగంలో ఇద్దరు ఇండియన్ అమెరికన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనాయంత్రాంగంలోని రెండు కీలక పోస్టులలో ఇద్దరు భారత సంతతికి చెందిన అమెరికన్లను నియమించారు. కాపీరైట్, పేటెంట్స్, ట్రేడ్‌మార్క్‌లకు సంబంధించి అమెరికా చట్టాల అమలును సమన్వయం చేసే పోస్టులలో వీరిని నియమించారు. 75 శాతం ఫెడరల్ నియంత్రణలను తొలగించాలనే ట్రంప్ ప్రణాళిక అమలును కూడా వీరు పర్యవేక్షిస్తారు. ట్రంప్ శుక్రవారం తన పాలనాయంత్రాంగంలో అనేక నియామకాలు చేస్తూ, అందులో భాగంగా ప్రముఖ ఇండియన్ అమెరికన్లు విశాల్ అమీన్, నియోమి రావులను కూడా నియమించారు. అమీన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కోఆర్డినేటర్‌గా, రావు ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరి అఫేర్స్ (ఒఐఆర్‌ఎ) అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. అమెరికా సెనేట్ ఈ నియామకాలను ఆమోదిస్తే, ప్రస్తుతం హౌస్ జ్యుడీషియరీ కమిటీలో సీనియర్ కౌన్సల్‌గా ఉన్న అమీన్.. డానియెల్ మార్టి స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. అమీన్ గతంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ పాలనాయంత్రాంగంలో వైట్ హౌస్‌లో డొమెస్టిక్ పాలసీకి, అమెరికా ఆర్థిక శాఖకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అమీన్ జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీ నుంచి న్యూరోసైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి లా డిగ్రీని పొందారు.
జార్జ్ మాసన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నియోమి రావు ఆ యూనివర్శిటీలో ‘సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టేట్’ను స్థాపించడంతో పాటు దానికి డైరెక్టర్‌గానూ పనిచేశారు. రాజ్యాంగ, పాలనా చట్టాలపై పరిశోధన, బోధనపై ఆమె కేంద్రీకరించి పనిచేశారు. ప్రస్తుతం ‘అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద యుఎస్’కు పబ్లిక్ మెంబర్‌గా పనిచేస్తున్న రావు గతంలో ఫెడరల్ ప్రభుత్వంలోని మూడు విభాగాలలోనూ పనిచేశారు.