అంతర్జాతీయం

ఇది రియాల్టీ షో కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 7: అమెరికా అధ్యక్ష పదవికోసం సాగే పోటీ వినోదాత్మక కార్యక్రమమో, రియాల్టీ షోనో కాదని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమని తేలిన తరువాత ఆయన గురించి ఒబామా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి. ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసిన ఒబామా వివాదాస్పద బిలియనీర్ అయిన ట్రంప్ గత చరిత్రను, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘ఇది వినోదాత్మక కార్యక్రమం కాదు. ఇది రియాల్టీ షో కాదు. ఇది అమెరికా అధ్యక్ష పదవికోసం జరిగే పోటీ’ అని ఒబామా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ‘రిపబ్లికన్ పార్టీ ప్రక్రియపైనా, ట్రంప్‌పైనా గౌరవభావంతో చెబుతున్నాను. వివిధ అంశాలపై తన వైఖరిని ప్రకటించడానికి ఆయనకు చాలా సమయం ఉంది. ఆయనకు ఉన్న సుదీర్ఘ చరిత్రను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆయన గతంలో చేసిన ప్రకటనలను తీవ్రంగా పరిగణించడం మాకెంతో ముఖ్యమని నేను భావిస్తున్నాను’ అని ఒబామా ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు. ట్రంప్ చేసిన వివిధ వివాదాస్పద ప్రకటనలపై నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా నిషేధం విధించాలని, మెక్సికోనుంచి వలసలను నిరోధించడానికి సరిహద్దుల్లో గోడ నిర్మించాలని సూచించడంతోపాటు అమెరికా నాటోకు అందజేస్తున్న నిధులపైనా ఆయన ధ్వజమెత్తారు. ‘మనం ఎంత తీవ్రమైన ఆందోళన కలిగించే పరిస్థితుల్లో ఉన్నామో వివరించాలనుకుంటున్నాను. ఇది ఎంతో ముఖ్యమైన, గంభీరమైన విధి’ అని ఒబామా.. ట్రంప్ వ్యాఖ్యల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్నారు. ప్రతి అభ్యర్థి ప్రమాణాలు పాటించాలని, తమను తాము తనిఖీ చేసుకోవాలని ఆయన హితవు పలికారు.