అంతర్జాతీయం

బలూచిస్తాన్‌లో పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 12: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో శక్తివంతమైన బాంబు పేలి 20 మంది మృతి చెం దారు. 35 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సెనెట్ డిప్యూటీ చైర్మన్ వౌలానా అబ్దుల్ గఫూర్ హైదరీ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయ న సల్పంగా గాయపడ్డారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా మస్టుంగ దర్గాకు ఆయన హాజరయ్యారు. తిరగి వెళ్తుండగా బాంబు పేలుళ్లు సంభవించాయి. హైదరీ స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడగా, ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. కాగా పేలుళ్లలో ఇరవై మంది అక్కడికక్కడే మృతి చెందారని, 35 మంది గాయపడ్డారని ముస్టంగ ఆసుపత్రి పిఆర్‌ఓ మాలిక్ జిబ్రాన్ వెల్లడించారు. గాయపడ్డవారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. 30 నుంచి 40 మంది వరకూ గాయపడ్డారని సీనియర్ పోలీ సు అధికారి అబ్దుల్ రజాక్ చీమా వెల్లడించారు. హైదరీ జమైత్ ఉలేమా ఇ ఇస్లామ్ ఫాజల్ (జెయుఐ-ఎఫ్) పార్టీకి చెందిన వారు. బాంబు పేలుళ్లలో చనిపోయినా వారిలో ఎక్కువ మంది ఆ పార్టీ కార్యకర్తలేనని అధికారులు తెలిపారు.
సెనెట్ డిప్యూటీ చైర్మన్‌ను లక్ష్యంగా చేసుకునే ఆత్మాహుతి దాడి జరిగిందని సెనెట్ చైర్మన్ రజా రబ్బానీ అన్నారు. హైదరీని హెలీకాప్టర్‌లో క్వెట్టాకు తీసుకురావాలని బలుచిస్తాన్ చీఫ్ సెక్రెటరీని కోరినట్టు ఆయన చెప్పారు. గాయపడ్డ డిప్యూటీ చైర్మన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు జియో టీవీ ప్రకటించింది. అలాగే తాను స్వల్పంగా గాయపడ్డానని హైదరీ దునియా టివితో మాట్లాడుతూ చెప్పారు.‘పేలింది అత్యంత శక్తివంతమైన బాంబే. ఇరవై మంది మృతి చెందా రు. అదృష్టవశాత్తూ నేను స్వల్పంగానే గాయపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సం తాపం’అని ఆయన పేర్కొన్నారు. పేలుళ్లలో హైదరీ కారు డ్రైవర్ మృతి చెందాడు. ధ్వంసమైన కారును టివి ఫూటేజీల్లో చూపించారు. ఇది ముమ్మాటికీ ఆత్మాహుతి దాడేనని ముస్టంగ జిల్లా పోలీసు అధికారి ఘాజన్‌ఫర్ అలీ తెలిపారు.

చిత్రం..బలూచిస్తాన్‌లో శుక్రవారం జరిగిన పేలుడు విధ్వంస దృశ్యంమిది