అంతర్జాతీయం

సీబీఐ విచారణపై మీ వైఖరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ల వ్యవహారంలో భారతదేశానికి సంబంధించి వెల్లడైన ప్రముఖుల లావాదేవీలపై సీబీఐ విచారణ జరిపించే అంశంపై జవాబు చెప్పాల్సిందిగా సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. జస్టిస్ దీపక్ మిశ్రా, శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పనామా పేపర్లలో దాదాపు 500 పేర్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై బహుళ దర్యాప్తు సంస్థల గ్రూపుచేత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. అయితే, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ అడ్వకేట్ ఎం.ఎల్. శర్మ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విదేశాల్లో ఖాతాలు ఉన్న భారతీయులు, స్టాక్‌మార్కెట్ రెగ్యులేటర్లపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని పిటిషన్‌లో కోరారు. సెబి చైర్మన్, షేర్ బ్రోకర్లు, ఇతర అనుబంధ వ్యక్తులపై, వ్యవస్థలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషనర్ సుప్రీం కోర్టును కోరారు. పనామా పేపర్లుగా ప్రసిద్ధి పొందిన ఈ స్కాంలో లీకైన 11వేల పైచిలుకు పేపర్ల ద్వారా సెలబ్రిటీలు అమితాబ్, ఐశ్వర్యారాయ్, లిక్కర్ రాజు విజయ్‌మాల్యా, డీఎల్‌ఎఫ్ యజమాని కేపీ సింగ్ సహా దాదాపు 500మంది భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.