అంతర్జాతీయం

అణు కార్యక్రమం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూన్ 4: ఐక్యరాజ్యసమితి తాజాగా తీవ్ర ఆంక్షలు విధించినప్పటికీ, తమ క్షిపణి అణ్వాయుధాల కార్యక్రమాలను విడనాడే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా ఆదివారం నాడు తెగేసి చెప్పింది. అమెరికా రూపొందించిన తీర్మానాలను ఆమోదిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఉత్తరకొరియాపై కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
గత రెండు వారాలుగా ఒకదాని తరువాత ఒకటిగా ఉత్తరకొరియా జరిపిన క్షిపణి పరీక్షల పర్యవసానంగానే ఐరాస భద్రతామండలి ఆ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అనేక ఉత్తరకొరియా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అనుమానిత అధికారులపైనా వేటు వేసింది. వీటన్నింటిపైనా అంతర్జాతీయ ఆంక్షలు అమలవుతాయని, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీల ఆస్తులను స్తంభింపజేస్తామని తెలిపింది. అయితే ఈ ఆంక్షలను తీవ్రంగా ఖండించిన ఉత్తర కొరియా తన అణు కార్యక్రమం విషయంలో రాజీ పడేది లేదని తెలిపింది. స్వీయ రక్షణార్థం తాము అణ్వాయుధ పాటవాన్ని సంతరించుకోకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఆంక్షలు విధించారని ఉత్తర కొరియా సీనియర్ అధికారి ఒకరు మండిపడ్డారు. ఓ పక్క తమపై అర్థం లేని ఆంక్షలను విధిస్తూ ముందస్తు షరతులు పెడుతూ గరిష్ఠస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తూ ‘‘మాట్లాడుకుందాం రండి’’ అంటూ అమెరికా పిలుపునివ్వటం విడ్డూరంగా ఉందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా చైనాలు కలిసి కట్టుగానే ఈ ఆంక్షల ముసాయిదాను రూపొందించాయని మండిపడ్డారు. ఓ పక్క తమ ఆయుధాలను ఆధునీకరించుకుంటూ, సైనిక దళాలను పటిష్టం చేసుకుంటున్న అమెరికాకు ఈ దిశగా ఏ దేశం ముందుకు వెళ్లినా తీవ్ర ఆగ్రహమే వస్తుందని తెలిపారు.