అంతర్జాతీయం

కతార్‌పై ట్రంప్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 10: ఇస్లామిక్ ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కతార్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు కతార్ నిధులను సమకూర్చడం చరిత్ర చెబుతున్న నిజమని, ఆ దేశంతో పాటు గల్ఫ్‌లోని ఇతర దేశాలు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడాన్ని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న రొమేనియా అధ్యక్షుడు క్లస్ జొహాన్నిస్‌తో కలసి వైట్‌హౌస్ రోజ్ గార్డెన్‌లో శుక్రవారం ట్రంప్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఉగ్రవాదులకు నిధులను సమకూర్చడం ద్వారా విద్వేషాన్ని నూరిపోస్తూ హత్యలను ప్రేరేపిస్తున్న దేశాలన్నీ తక్షణమే ఆ పనులు మానుకోవాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు కతార్ ‘అత్యున్నత స్థాయి’లో నిధులను సమకూరుస్తోందని, గల్ఫ్‌లోని మరికొన్ని ఇతర దేశాలు కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘ఉగ్రవాదులకు కతార్ అత్యున్నత స్థాయిలో నిధులు సమకూరుస్తుండటం విచారకరం. కతార్ తీరును అడ్డుకుని ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడాలని గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని దేశాలు నన్ను కోరాయి. దీనిపై మేము నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో మృదువుగా వ్యవహరించాలా? లేక కఠినమైన చర్యలు చేపట్టాలా? అనే విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడాల్సిన అవసరం ఉంది. కనుక కతార్ ఇటువంటి పనులు చేయకుండా ఆపాలని మేము నిశ్చయించుకున్నాం’ అని వివరించారు.

చిత్రం.రొమేనియా అధ్యక్షుడు క్లస్ జొహాన్నిస్‌తో కలసి విలేఖరులతో మాట్లాడుతున్న ట్రంప్