అంతర్జాతీయం

లండన్‌లో మరో ఉగ్రదాడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 19: ఉగ్రదాడులు బ్రిటన్ రాజధాని లండన్‌ను వణికిస్తున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి ఒక మసీదు వద్ద రంజాన్ ప్రార్థనలు ముగించుకుని వస్తున్న జనంపైకి వ్యాన్ దూసుకురావడంతో ఒక వ్యక్తి మరణించగా, పదిమంది గాయపడ్డారు. లండన్ నగరానికి ఉత్తరాన ఉన్న సెవెన్ సిస్టిర్స్ రోడ్డులో ఈ సంఘటన జరిగింది. వెంటనే ఫిన్స్‌బరీ పార్క్‌లో ఉన్న మరో మసీదు వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిని ఉగ్రదాడిగానే పరిగణిస్తున్నామని, ఈ సంఘటనకు సంబంధించి 48ఏళ్ల వయస్సున్న వ్యక్తిని అరెస్టు చేశామని హోమ్ సెక్రెటరీ అంబర్ రద్ విలేఖరులకు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు- ఒక వ్యక్తి వ్యాన్ డ్రైవ్ చేస్తూ జనాన్ని ఢీకొట్టాడని, ఆ వెంటనే ‘ముస్లింలను అందరినీ చంపేస్తాను’ అంటూ గట్టిగా అరిచాడని తెలిపారు.