అంతర్జాతీయం

సరుూద్ గృహ నిర్బంధం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూన్ 19: ముంబయి దాడుల వ్యూహకర్త, కీలక నిందితుడు సరుూద్ హఫీజ్ గృహ నిర్బంధం కేసు తీర్పును సోమవారం లాహోర్ హైకోర్టు వచ్చే నెల మూడుకు వాయిదా వేసింది. పాకిస్తాన్‌లో జిహాద్ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారన్న అభియోగం పై సరుూద్ హఫీజ్, అతని అనుచరులు నలుగురిపై లాహోర్ హైకోర్టు గృహ నిర్బంధాన్ని విధించింది.
సోమవారం కోర్టు తుది తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో డిప్యూటీ అటార్నీ జనరల్ కోర్టుకు హాజరు కాలేదని తీర్పును వచ్చేనెల మూడుకు వాయిదా వేయాలన్న ప్రభుత్వ అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సరుూద్ గృహ నిర్బంధం గత ఏప్రిల్ 30తో ముగియనుండగా ప్రభుత్వం అతన్ని జుడీషియల్ రివ్యూ బోర్డు ముందు హాజరు పరచకుండానే గృహ నిర్బంధాన్ని పొడిగించిందని సరుూద్ తరఫు న్యాయవాది దోగర్ విలేఖరులకు తెలిపారు. కేవలం అమెరికా, భారత్‌ల మెప్పు పొందేందుకే అతని నిర్బంధాన్ని పొడిగిస్తోందని ఆయన వ్యాఖ్యలు చేశారు. సరుూద్‌పై మోపిన ఆరోపణలేవీ ఇంతవరకు రుజువు చేయలేదని, అక్రమంగా తన క్లైంట్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని అయన పేర్కొన్నారు.