అంతర్జాతీయం

‘నరుూమ్’ దుస్తుల్లో మరోసారి మెరిసిన మిషెల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 14: ఇండో-అమెరికా ఫ్యాషన్ డిజైనర్ నరుూమ్ ఖాన్ రూపొందించిన దుస్తుల్లో అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా మరోసారి మెరిసిపోయింది. నార్డిక్ దేశాల నాయకుల గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆమె నరుూమ్ రూపొందించిన దుస్తుల్లో తళుక్కుమన్నారు. మిషెల్లీకి అత్యంత ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్లలో నరుూమ్ ఒకరు. అందుకే ఆమె ఇంతకుముందు 2009లో కూడా నరుూమ్ రూపొందించిన దుస్తులను ధరించి తొలిసారి ప్రభుత్వ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు సాధారణంగా ఏదో ఒక దేశాధినేతకు విందును ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుతం అందుకు విరుద్ధంగా స్వీడన్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే దేశాల అధినేతల గౌరవార్థం ఒబామా ఈ విందును ఏర్పాటు చేశారు. నరుూమ్ రూపొందించిన దుస్తులతో ఈ కార్యక్రమానికి హాజరైన భార్య మిషెల్లీని చూసి ఒబామా మురిసిపోయాడు.