అంతర్జాతీయం

శిఖరాగ్రానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్,జూన్ 25: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సోమవారం జరిగే శిఖరాగ్ర సమావేశం అనేక కోణాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల కాలంలో తీవ్రస్థాయి అలజడి సృష్టించిన హెచ్-1బి వీసాలు, పౌర అణు ఇంధన ఒప్పందం, నాసా-ఇస్రోలు సంయుక్తంగా తలెట్టిన ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం వంటి అనేక ద్వైపాక్షిక అంశాలు మోదీ-ట్రంప్ మధ్య జరిగే చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్‌తో చర్చల్లో భాగంగా ఆదివారం వాషింగ్టన్ చేరుకున్న మోదీకి అపూర్వ రీతిలో స్వాగతం లభించింది. భారత్-అమెరికాల మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచే దిశగానే ఆచితూచి మోదీ ఈ చర్చల సందర్భంగా ఆచితూచి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్-1బి వీసాల వ్యవహారం అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అత్యధిక స్థాయిలో ఈ వీసాలను ఉపయోగిస్తున్న భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ముందు మోదీ తన వాదనను బలంగా వినిపించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ సహా ఉగ్రవాద దేశాల ఆటకట్టించే విషయంలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా ట్రంప్ దృష్టికి మోదీ తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలను అన్ని కోణాల్లోనూ బలోపేతం చేయడమే ఏకైక అజెండాగా ముందుకెళుతున్న మోదీతో వివిధ దశల్లో మొత్తం ఐదు గంటల పాటు ట్రంప్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రతి సందర్భాన్నీ మోదీ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోగలరన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. వైట్‌హౌస్‌లో మోదీ గౌరవార్థం ఇచ్చే విందుతో మొదలయ్యే ఈ సమావేశాల పరంపర వివిధ దశల్లో సాగుతుంది. ద్వైపాక్షిక చర్చలు, ప్రతినిధు స్థాయి చర్చలు మొదలైనవి ఒకదాని తర్వాత ఒకటిగా ఇరు దేశాల మధ్య సాగుతాయి. వర్కింగ్ డిన్నర్‌ను మొట్ట మొదటిసారిగా మోదీకి ట్రంప్ ప్రభుత్వం ఇవ్వడం కూడా రెండు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనంగా చెబుతున్నారు.
హెచ్-1బి వీసాల అంశాన్ని మోదీ చాలా బలంగా ప్రస్తావిస్తే మాత్రం తాము కూడా తమ వాదనను వినిపించడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని ట్రంప్ ప్రభుత్వ అధికారులు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంక్లిష్టమైన అంశంపై ఏ రకమైన పురోగతి సాధ్యమన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
ఇరు దేశాల మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిలో కుదిరిన చారిత్రక పౌర అణు ఇంధన ఒప్పందం దీర్ఘకాలంగా పురోగతి లేకుండానే ఉంది. దీని అమలుపై ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ ఒప్పందాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై మోదీ-ట్రంప్‌లు చర్చించే అవకాశం కనిపిస్తోంది. 2008లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్‌లలో వెస్టింగ్‌హౌస్,జిఇ హిటాచీ కంపెనీలు ఆరు అణు రియాక్టర్లను నిర్మించాల్సి ఉంది. అయితే ఈ రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి మోదీ-ట్రంప్ భేటీలో ఎలాంటి ఒప్పందాలు కుదిరే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ఇద్దరు నేతల శిఖరాగ్ర భేటీపై అంతరిక్ష శాస్తవ్రేత్తలు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇరు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలైన నాసా-ఇస్రోలు సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహ నిర్మాణం ముందుగు సాగుతుందా అన్నదే వీరి ఉత్కంఠ. దీనిపై ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సానుకూలంగా ఉండగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన నేపథ్యంలో పర్యాపరణ మార్పుల నిరోధంపైనా మోదీ చాలా బలంగానే తన వాదన వినిపించే అవకాశం కనిపిస్తోంది. రక్షణ రంగంలో సహకారంతో ఇతర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా మోదీ-ట్రంప్‌లు దృష్టి పెట్టే అవకాశం ఉంది.

చిత్రం.. వాషింగ్టన్‌లోని విల్లార్డ్ హోటల్‌లో అమెరికా సీఈఓలతో ప్రధాని మోదీ