అంతర్జాతీయం

గౌరవించటం నేర్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 16: సరిహద్దు సమస్య పరిష్కారానికి భారత్ చైనాలు చేస్తున్న ప్రయత్నాలను గౌరవించాలని అమెరికాకు చైనా హితవు చెప్పింది. భారత్ సరిహద్దుల్లో చైనా అదనపు బలగాలను మోహరించినట్లు అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన కేంద్రం పెంటగాన్ తాజాగా తన 2016 వార్షిక నివేదికలో హెచ్చరించటంపై చైనా తీవ్రంగా మండిపడింది. ‘మేము భారత్‌తో సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. చర్చల ద్వారా పరిష్కారాన్ని అనే్వషిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. సరిహద్దు సమస్య పరిష్కరించుకునే సామర్థ్యం రెండు దేశాలకు ఉందని.. ఇతర దేశాలు ఆ ప్రయత్నాలను గౌరవించాలి కానీ.. దాన్ని వ్యతిరేకించరాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తూర్పు ఆసియాకు ఆమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి అబ్రహం డెన్మార్క్ అంతకుముందు మాట్లాడుతూ.. ‘‘్భరత్ సరిహద్దుల్లో చైనా బలగాల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. అయితే ఈ మోహరింపు వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటన్నది తెలియదు’ అని అన్నారు. డెన్మార్క్ మాటల్ని చైనా తీవ్రంగా ఖండించింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లో కృత్రిమంగా నిర్మించిన ద్వీపాల్లో సైనిక బేస్‌లను ఏర్పాటు చేసేందుకు చైనా దృష్టి సారించిందని కూడా పెంటగాన్ రిపోర్ట్ పేర్కొంది.