అంతర్జాతీయం

మాది స్నేహహస్తమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్/న్యూఢిల్లీ, మే 23: దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదాలపై భారత్‌తో ద్వైపాక్షిక చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు ప్రణబ్ ముఖర్జీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై చైనా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా పర్యటనలో భాగంగా 25న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమవుతున్న ప్రణబ్ ముఖర్జీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్యలు జరపనున్నారు. చైనా మీడియాతో అక్కడి విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హూ చున్యుంగ్ సోమవారం మాట్లాడుతూ ‘చైనా పర్యటనకు తొలిసారి వస్తున్న భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి హార్దిక స్వాగతం పలుకుతున్నాం. భౌగోళికంగా దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదాలపై ఉభయులకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు కనుగొనేలా ద్వైపాక్షిక చర్చలు జరిపడానికి భారత్‌ను స్వాగతిస్తున్నాం’ అన్నారు. సరిహద్దుల్లో భద్రతకు విఘాతం కలుగకుండా ఇప్పటికే సరైన విధానానే్న పాటిస్తున్నాయన్నారు.