అంతర్జాతీయం

భారత్‌పై అణుబాంబు వేయాలనుకున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, జూలై 27: భారత్‌పై అణు బాంబుతో దాడి చేయాలని 2001లో అనుకున్నానని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ వెల్లడించారు. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇరుదేశాలు సరిహద్దుల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించాయి కూడా. ఆ సమయంలో భారత్‌పై ఆణుబాంబు దాడి చేయాలని తాను అనుకున్నానని, అయితే భారత్ వద్ద కూడా అణ్వస్త్రాలు ఉన్న విషయం గుర్తుకు వచ్చి ఆ ఆలోచన విరమించుకున్నానని ప్రస్తుతం దుబాయిలో చికిత్స పొందుతున్న ముషారఫ్ ఒక జపాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దరిమిలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారి పరిస్థితులు చక్కబడ్డాయి. అణ్వస్త్రాలను మోహరించాలా, వద్దా అనే విషయమై ఆలోచిస్తూ అప్పట్లో అనేక నిద్రలేని రాత్రులు గడిపానని కూడా ముషారఫ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో క్షిపణులకు అణు వార్‌హెడ్‌లను బిగించే సామర్థ్యం భారత్, పాక్‌లు రెండింటికీ లేదని, అయితే రెండు మూడు రోజుల్లో ఆ పని పూర్తి చేసి ఉండే వాళ్లమని కూడా ముషారఫ్ చెప్పారు.
2002లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, అణ్వస్త్రాలకు సంబంధించి లక్ష్మణ రేఖను దాటే ప్రమాదం కూడా ఉండిందని ముషారఫ్ చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. అణ్వస్త్రాలను ఉపయోగించే అవకాశం లేదని తాను చెప్పలేనని ముషారఫ్ అప్పట్లో అనేకసార్లు అన్నారు కూడా. అణు వార్‌హెడ్‌లను ప్రయోగించే స్థితిలో ఉంచాలని మీరు ఆదేశాలు ఇచ్చారా అని అడగ్గా, ఆ పని తాము చేయలేదని, భారత్ కూడా ఆ పని చేసి ఉంటుందని తాము అనుకోలేదని, భగవంతుడి దయవల్ల ఆ పరిస్థితి తప్పిందని అన్నారు. పాక్‌వద్ద అణ్వస్త్రాలు ఉన్నప్పటికీ భారత్ వద్ద ఉన్న అణ్వస్త్రాల సంఖ్య ఎక్కువని పాక్ రక్షణ నిపుణులు అప్పట్లో భావించారని, ఒకవేళ పాక్ దాడి చేసిన వెంటనే తేరుకొని ఎదురు దాడి చేస్తుందేమోనని భయపడ్డారని, అందుకే ముషారఫ్ ఆ ఆలోచన విరమించుకుని ఉంటారని ఆ పత్రిక తెలిపింది.
1999 అక్టోబర్‌లో అప్పుడు ఆర్మీ చీఫ్‌గా ఉండిన ముషారఫ్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను గద్దె దింపి 2001నుంచి 2008 వరకు సైనిక పాలకుడిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లింలీగ్ తిరిగి విజయం సాధించింది. ముషారఫ్‌పై అనేక అభియోగాలు నమోదయ్యాయి. 2007లో పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య వీటిలో ప్రధానమైనది. ఈ కేసులపై విచారణ జరుగుతోంది కూడా. కాగా, అనారోగ్యం కారణంగా విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు నవాజ్ షరీఫ్ అనుమతించడంతో 73 ఏళ్ల ముషారఫ్ దుబాయిలో ఉంటున్నారు.