అంతర్జాతీయం

నల్లిని చంపబోతే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, జూలై 28: ఏదో సామెత చెప్పినట్టు.. నల్లిని చంపడానికి నిప్పురాజేస్తే మంటలు గదంతా వ్యాపించి మొత్తం అపార్ట్‌మెంట్‌నే చుట్టేశాయి. అమెరికాలోని కాన్సాస్‌లోని టొపెకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యాతావాతా 1,40,000 డాలర్ల నష్టం వాటిల్లిందని అధికారులు లెక్కకట్టారు. మంటల వల్ల అపార్ట్‌మెంట్‌లోని జనాన్ని ఖాళీ చేయించారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ వారు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీయగా నల్లి విషయం తెలిసి అవాక్కయ్యారు. ఓ ఫ్లాట్‌లో మాస్టర్ బెడ్ రూమ్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయని టొపెకా అగ్నిమాపక అధికారి మైక్ మార్టిన్ వెల్లడించారు. ‘నల్లిని చంపడానికి మహిళ లైటర్ వెలిగించింది. ప్రమాదవశాత్తూ మంటలు లేచాయి’ అని ఆయన చెప్పారు. అదృష్టశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే వివిధ సంస్థలకు చెందిన అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. అగ్నిప్రమాదం వల్ల మూడంతస్తుల అపార్ట్‌మెంట్ అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఏం జరుగుతుందో తెలియని ఆందోళన వ్యక్తమైంది.