అంతర్జాతీయం

మీ దౌత్య సిబ్బందిని తగ్గించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 28: అమెరికా తనపై తాజాగా ఆంక్షలు విధించడానికి ప్రతీకారంగా నెల రోజుల్లోపల తమ దేశంలో ఉన్న అమెరికా దౌత్యవేత్తల్లో కొందరు దేశం వదిలిపెట్టి వెళ్లాలని, అమెరికా దౌత్య కార్యాలయాలకు చెందిన కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్నామని రష్యా శుక్రవారం అమెరికాకు అల్టిమేటం ఇచ్చింది. రష్యాపై కొత్త ఆంక్షలు విధించాలని ప్రతిపాదించే బిల్లుకు అనుకూలంగా అమెరికా సెనేట్ ఓటు వేసిన తర్వాత రష్యా విదేశాంగ శాఖ ఈ ప్రతీకార చర్యలను ప్రకటించింది. అమెరికా సెనేట్ ఆమోదించిన ఈ బిల్లుతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి చిక్కు వచ్చిపడింది. రష్యాపై కఠిన వైఖరి అవలంబించాలా లేక ఈ బిల్లును వీటో చేయడం ద్వారా తన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ ఆగ్రహాన్ని ఎదుర్కోవాలో తేల్చుకోలేని స్థితిలో ఆయన పడిపోయారు. రష్యా ఇప్పటివరకు సంయమనం పాటిస్తూ వస్తోందని, అయితే అర్థం లేని అమెరికా ప్రవర్తన కారణంగా ప్రతీకార చర్యలకు దిగక తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం హెచ్చరించారు కూడా. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోవడానికి యత్నించిందంటూ అమెరికా గూఢచార ఏజన్సీలు ఆరోపించిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోవడం తెలిసిందే. సెప్టెంబర్ 1 నాటికల్లా అమెరికా రష్యాలో తన దౌత్య సిబ్బంది సంఖ్యను అమెరికాలో ఉన్న 455 మంది రష్యా దౌత్య సిబ్బంది స్థాయికి తగ్గించుకోవాలని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ దేశంపై కొత్తగా ఆంక్షలు విధించాలన్న అమెరికా కాంగ్రెస్ నిర్ణయం అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా మితిమీరిన జోక్యాన్ని ధ్రువీకరిస్తోందని ఆ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం రష్యాలో 1100 మంది దాకా అమెరికా దౌత్యసిబ్బంది ఉన్నట్లు మాస్కోలోని అమెరికా దౌత్య కార్యాలయంలోని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు.