అంతర్జాతీయం

పాక్ తాత్కాలిక ప్రధాని అబ్బాసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 29: పాకిస్తాన్‌లోని పిఎంఎల్-ఎన్ ప్రభుత్వానికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పెట్రోలియం శాఖ మాజీ మంత్రి షాహిద్ ఖకన్ అబ్బాసీ తాత్కాలిక ప్రధాన మంత్రిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యే వరకు పిఎంఎల్-ఎన్ ప్రభుత్వాన్ని అబ్బాసీ నడుపుతారని పాకిస్తాన్ మీడియా కథనాలను బట్టి స్పష్టమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించిన కేసులో పాకిస్తాన్ సుప్రీం కోర్టు శుక్రవారం నవాజ్ షరీఫ్ (67)ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించడంతో పాటు ఆయనపైన, ఆయన పిల్లలపైన అవినీతి కేసులు నమోదు చేయాలని ఆదేశించడం, ఆ వెంటనే ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో పిఎంఎల్ నాయకులు సమావేశమై మూడు గంటల పాటు చర్చించారని, తదుపరి ప్రధాన మంత్రిగా నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్‌ను నియమించాలని, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యే వరకు పెట్రోలియం శాఖ మాజీ మంత్రి అబ్బాసీని తాత్కాలిక ప్రధాన మంత్రిగా నియమించి ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నడిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు జియో టీవీ వెల్లడించింది. ఈ నిర్ణయంపై నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని జియో టీవీ పేర్కొంది.