అంతర్జాతీయం

ఆల్ప్స్ పర్వతాలపై మానవ శరీర భాగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేనోబుల్(ఫ్రాన్స్), జూలై 29: ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మానవ శరీర భాగాలు ఫ్రాన్స్‌లోని వౌంట్ ఆల్ప్స్‌పై కనుగొన్నారు. డేనియల్ రోచే అనే వ్యక్తి వీటిని కనుగొని అధికారులు సమాచారం అందించాడు. విమాన ప్రమాదాల్లో శకలాలు సేకరించడం డేనియల్‌కు ఇష్టం. ఇందులో భాగంగానే ఆల్ప్స్ పర్వతాలపై అనే్వషిస్తుండగా మానవ శరీర భాగాలు కనిపించాయి. తన అనే్వషణలో మానవ శరీర భాగాలు కనుగొడం ఇదే మొదటిసారని రోచే చెప్పాడు. ఈసారి ఓ మనిషి చేయి, తొడభాగాన్ని కనుగొన్నట్టు అతడు తెలిపాడు. అలాగే విమానాలకు సంబంధించి జెట్ ఇంజన్లు రోచ్ కనుగొన్నాడు. 1966లో ఎయిర్ ఇండియా బోయింగ్ 707 విమానం బాంబే నుంచి న్యూయార్క్ వస్తూ కూలిపోయింది. వౌంట్ బ్లాంక్స్ సమ్మిట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 117 మంది దుర్మణం పాలయ్యారు. ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమానం 1950లో ఫ్రాన్స్ పర్వతాల్లో కూలిపోయింది.