అంతర్జాతీయం

మత విద్వేషాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 6: అయిదేళ్ల క్రితం అమెరికాలోని ఓక్ క్రీక్ గురుద్వారాపై కాల్పులు జరిపి ఆరుగురు సిక్కులను పొట్టన పెట్టుకున్న సంఘటన సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా జాత్యహంకారం, మత విద్వేషం, హింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్వేషం, విభేదాలకన్నా తాము బలమైన వాళ్లమని గత అయిదేళ్ల కాలంలో ఓక్ క్రీక్ ప్రజలు నిరూపించారని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ రియాన్ అన్నారు. 2012 ఆగస్టు 5వ తేదీ విస్కాన్సిన్‌లోని ఓక్ క్రీక్ ప్రాంతంలో సిక్కు గురుద్వారాపై శే్వతజాతీయుడొకరు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు సిక్కులు మరణించడం తెలిసిందే. పౌల్ రియాన్ అమెరికా ప్రతినిధుల సభలో విస్కాన్సిన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయిదేళ్ల క్రితం సిక్కు మందిరంపై జరిపిన అమానుషమైన దాడికి ఓక్ క్రీక్ చలించి పోయిందని, ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని సంస్మరించుకోవడం ద్వారా ఈ రోజు ఆ సంఘటనను గుర్తు చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా సిక్కు సమాజాన్ని చూసి తాను ఎంతో గర్విస్తున్నానని, వారి దయాగుణం, శాంతిని కోరుతూ వారు ఇచ్చిన సందేశం మొత్తం దేశానే్న కదిలించిందని సెనేటర్ టామీ బాల్డ్‌విన్ అన్నారు. ఎన్నో తరాలుగా అమెరికాలోని సిక్కులు మన దేశానికి చెప్పుకోదగ్గ సేవలను అందించారని, ఇప్పటికి కూడా వారు జాత్యహంకారం, విద్వేషం, హింసకు గురవుతూ ఉండడం విచారకరమని న్యూయార్క్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు గ్రేస్ మెంగ్ అన్నారు.