అంతర్జాతీయం

సత్తా చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఆగస్టు 10: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర కొరియా మరింతగా రెచ్చిపోతోంది. అమెరికా తన సైన్యాన్ని మోహరించిన గువామ్ దీవిపై దాడికి కసరత్తు మొదలు పెట్టింది. రానున్న వారంలోనే ఈ సైనిక స్థావరంపై దాడులు జరుపుతామన్న సంకేతాలూ అందించింది. మరో పక్క ట్రంప్‌కు అసలు ఆలోచనే లేదంటూ తాజాగా ధ్వజమెత్తిన ఉత్తర కొరియా నాయకత్వం ‘గువామ్ దీవిపై తీవ్ర స్థాయిలో దాడి జరిపితే తప్ప ట్రంప్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు’అని తెలిపింది. అమెరికా అణ్వాయుధాలు ఇప్పటి వరకూ ఎన్నడూ చూడనంత శక్తివంతమైనవని, వీటితో ఉత్తర కొరియా భరతం పడతామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దాదాపుగా యుద్ధ వాతావరణమే నెలకొంది. అసలు ఉత్తర కొరియా శక్తి ఏమిటి..అది చేస్తున్న హెచ్చరికల తీవ్రత ఎంత తీవ్రమన్న ఆలోచన లేకుండా రెచ్చగొడుతూ పోవడం వల్ల పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే దాని ప్రభావం కొరియా ద్వీపకల్పంపైనే కాకుండా ఇతర ప్రాంతాలపైనా తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న వాదనా గట్టిగా వినిపిస్తోంది. గత నెల్లో ఉత్తర కొరియా రెండు ఖండాంతర క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మొత్తం అమెరికా భూభాగానే్న దాడుల పరిధిలోకి తెచ్చింది. కాగా, తమపై అత్యంత తీవ్రస్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ చెప్పడం అర్థం లేని ప్రకటన అని ఉత్తర కొరియా క్షిపణి దళాల కమాండర్ కిమ్ రక్-గియోమ్ అన్నారు. ఆలోచన లేని వ్యక్తి చేసే ఇలాంటి హెచ్చరికలకు ఎలాంటి అర్థం ఉండదని కూడా ఆయన అన్నారు. ఆగస్టు మధ్య నాటికల్లా గువామ్‌పై దాడి ప్రణాళికను సిద్ధం చేస్తామని, దీన్ని అధ్యక్షుడు కిమ్‌కు నివేదిస్తామని తెలిపారు. నాలుగు క్షిపణులను ఏకకాలంలో దాడి చేస్తామని, జపాన్ ప్రాంతాలైన హిరోషిమా,షిమానే, కోయిచీ మీదుగా వెళతాయని తెలిపారు.
అమెరికానే ఆదుకుంటుంది!
ఇదిలా ఉండగా తమ ప్రాంతంలో మోహరించిన అమెరికా దళాల శక్తియుక్తులపై తమకు పూర్తి నమ్మకం ఉందని గువామ్ వాసులు అంటున్నారు. మాటల యుద్ధం తీవ్రం అవుతూండటంతో పరిస్థితి ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళనా వారి మాటల్లో కనిపిస్తోంది. గువామ్‌పై దాడి ప్రణాళికను సిద్ధం చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించడంతో ఇక్కడి వాసుల్లో భయం మరింత తీవ్రమైంది.