అంతర్జాతీయం

బెదిరింపులకు చింతించక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 12: ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ అన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. అమెరికా భూభాగంపై గానీ, మిత్రదేశాలపైగానీ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా అందుకు కిమ్ తీవ్రంగా చింతించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ‘కిమ్, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్ల నుంచి బెదిరింపులకు దిగుతున్నారు. మరోసారి ఇటువంటి బెదిరింపులకు పాల్పడితే కిమ్ ప్రభుత్వంపై అమెరికా చర్యలు చేపట్టక తప్పదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. గువామ్‌పై క్షిపణి దాడులు చేస్తామని కిమ్ ఈ వారం అమెరికాను బెదిరించడంతో ట్రంప్ ఈ హెచ్చరికను జారీ చేశారు. వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు ఆ దేశంపై కొత్తగా ఆర్థిక ఆంక్షలు విధించాలని అమెరికా తీర్మానించడంతో గువామ్‌పై క్షిపణి దాడులు నిర్వహిస్తామని కిమ్ కొద్ది రోజుల క్రితం బెదిరించిన విషయం తెలిసిందే. అయితే గువామ్‌పై గానీ, అమెరికా భూభాగంపై గానీ, తమ మిత్రదేశాల భూభాగాలపై గానీ కిమ్ ఎటువంటి దాడులకు తెగబడినా అందుకు ఆయన తీవ్రంగా చింతించక తప్పదని ట్రంప్ పేర్కొన్నారు. అణ్వాయుధాలతో విర్రవీగుతున్న ఉత్తర కొరియా ఎటువంటి తెలివి తక్కువ పని చేసినా ఆ దేశంపై విరుచుకుపడేందుకు అమెరికా సైనిక వ్యవస్థలన్నీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని కిమ్ మరో మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నామని ట్రంప్ అంతకుముందు ట్వీట్ చేశారు. అలాగే కొరియా ద్వీపకల్పంపై రాత్రికి రాత్రే ముప్పేట దాడి చేసేందుకు తమ సైనిక దళం సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అధికారులు స్పష్టం చేసినట్లు ‘్ఫక్స్ న్యూస్’ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా, ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో ట్రంప్ తమ జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, సమస్యకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని తాను ఇప్పటికీ ఆశిస్తున్నానని చెప్పారు.
ట్రంప్, జిన్‌పింగ్ మధ్య అంగీకారం
కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధాల నిర్మూలనకు తాము కట్టుబడి ఉన్నామని ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శనివారం పునరుద్ఘాటించారు. గువామ్‌పై క్షిపణి దాడులు నిర్వహిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ బెదిరించడంతో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ట్రంప్, జిన్‌పింగ్ టెలిఫోన్ ద్వారా చర్చించారని, ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న ఉత్తర కొరియాతో తక్షణమే ఆ ధోరణిని మాన్పించాల్సిన అవసరం ఉందని వారిద్దరూ అంగీకారానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ ఒక ప్రకటనలో వెల్లడించింది.

చిత్రం.. డొనాల్డ్ ట్రంప్