అంతర్జాతీయం

రాళ్ల దాడికి భారత బలగాలే కారణం: చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 21: లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఈ నెల 15వ తేదీన భారత్, చైనా సైనిక బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు, రాళ్ల దాడుల పట్ల చైనా సోమవారం నిరసన వ్యక్తం చేసింది. ఈ ‘హింసాత్మక చర్యల’కు భారత బలగాలే కారణమని చైనా ఆరోపించింది. లడఖ్‌లో ఈ నెల 15వ తేదీన చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని భారత సరిహద్దు భద్రతా బలగాలు భగ్నం చేయడం రాళ్ల దాడికి దారితీయడంతో ఇరు పక్షాల్లోని కొంతమంది సైనికులకు స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 15వ తేదీన చైనా సరిహద్దు బలగాలు వాస్తవాధీన రేఖ వెంబడి తమ భూభాగంలో ఎప్పటి మాదిరిగానే గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగిందని, భారత బలగాలే హింసాత్మక చర్యలకు దిగి తమ సైనికులను గాయపర్చాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఆరోపించారు. ఈ ఘటనపై భారత్‌కు నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. అయితే పాంగాంగ్ సరస్సు వద్ద జరిగిన ఘటనలపై ఇరు దేశాలకు చెందిన స్థానిక సైనిక కమాండర్లు చర్చించారని భారత్ పేర్కొంది. సిక్కింలోని డోక్లామ్ ప్రాంతంలో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య మూడు నెలలనుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డోక్లామ్‌లో భారత సైనిక బలగాలు చైనా భూభాగంలోకి ప్రవేశించాయని, ఉద్రిక్తతలకు తెర దించాలంటే భారత బలగాలను తక్షణమే అక్కడి నుంచి ఉపసంహరించాలని చైనా వాదిస్తోంది.