అంతర్జాతీయం

స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా.. కదిలిన శ్రీలంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 8: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి, అమలు చేస్తున్న ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం శ్రీలంకను విపరీతంగా ఆకట్టుకుంది. స్వచ్ఛ భారత్‌ను ప్రేరణగా తీసుకుని శుభ్రత కోసం నడుంబిగించింది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీలంక ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీని కోసం పరిశోధన, అభివృద్ధి ప్రాంతీయ కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నగర ప్రణాళిక, నీటి సరఫరా మంత్రి రవుఫ్ హకీం ఇక్కడో కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమం తరహాలో ఓ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు శుక్రవారం ఇక్కడ ప్రకటించారు.‘దక్షిణాసియా ప్రాంతంలో శానిటేషన్ అన్నది ఓ ప్రధాన సమస్యగా ఉంది. సామాజిక సేవలకు అదో పెను సవాల్‌గా మారింది’అని మంత్రి స్పష్టం చేశారు. సచ్ఛ భారత్‌ను ప్రేరణగా తీసుకుని కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిపారు. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజాచైనత్యం తీసుకురావల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.