అంతర్జాతీయం

హడలెత్తించిన హరికేన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 10: కరేబియన్ దీవుల్లో అల్లకల్లోలం సృష్టించిన ‘ఇర్మా’ హరికేన్ ఆదివారం ఉదయానికి మరింత బలపడి అమెరికాలోని ఫ్లోరిడా తీరాన్ని తాకింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హరికేన్ ఇర్మా ఫ్లోరిడాలోని కీ వెస్ట్ ప్రాంతాన్ని తాకినట్లు యుఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. మధ్యాహ్నానికి హరికేన్ పూర్తిగా తీరాన్ని దాటిన తర్వాత పశ్చిమంగా పయనించవచ్చని, ఫలితంగా మయామికి ముప్పు ఉండకపోవచ్చని కూడా ఆ సెంటర్ తెలిపింది. పెను తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రంలో పది లక్షల మందికి పైగా చీకట్లోనే మగ్గుతున్నారు. కాగా, ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇప్పటివరకు నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. కీ వెస్ట్‌లోని మోన్రో కౌంటీలో పెనుగాలుల తాకిడికి కారు అదపు తప్పడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, ఫ్లోరిడాలోని హార్డీ కౌంటీలో జరిగిన కారు ప్రమాదంలో మరో ఇద్దరు చనిపోయారు. ఒక స్కూల్లో తలదాచుకున్న మరో వృద్ధుడు కూడా సహజ కారణాలతో మృతి చెందాడు.
కాగా, హరికేన్ ఇర్మా తీరాన్ని తాకడానికి ముందు అధ్యక్షుడు ట్రంప్ హరికేన్ ప్రయాణించే మార్గంలో ఉండే వారంతా అత్యింత ప్రమాదకరమైన ఈ తుపానుకు దూరంగా వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఆస్తులకన్నా ప్రాణాలు ముఖ్యమని, అందువల్ల ఆస్తుల గురించి ఆలోచించకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్న అధికారుల ఆదేశాలను పాటించాలని ఆయన కోరారు.
12 గంటలకు ముందు కేటగిరీ-3 తుపానుగా ఉండిన ఇర్మా, ఫ్లోరిడా తీరాన్ని సమీపించే సమయానికి మరింత బలపడి తిరిగి కేటగిరీ-4 తుపానుగా మారిందని, ఫ్లోరిడా కీ ప్రాంతాన్ని తాకిన సమయంలో గంటకు 130 మైళ్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని యుఎస్ నేషనల్ హరికేన్ అధికారులు హెచ్చరించారు. సముద్రంలో అలలు సైతం 20 అడుగుల ఎత్తు వరకు ఎగసి పడి పల్లపు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఫ్లోరిడా రాష్ట్రంలో తుపాను తాకిడికి గురయ్యే ప్రాంతాలనుంచి 63 లక్షల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారత ఎంబసీ హెల్ప్‌లైన్
ఫ్లోరిడానుంచి ఖాళీ చేసిన వారిలో వేలాది మంది భారతీయ అమెరికన్లు కూడా ఉన్నారు. వీరి కోసం అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం 24 గంటలు పని చేసే ఒక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉన్నారు. కంట్రోల్ రూమ్‌నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించడం కోసం న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తి అట్లాంటాలోనే ఉన్నారు. అట్లాంటాలోని కాన్సులేట్ కూడా హెల్ప్‌లైన్ నంబర్లను ట్వీట్ చేసింది. ‘్ఫ్లరిడానుంచి ఖాళీ చేయించిన భారతీయులను ఆదుకోవడానికి అట్లాంటా పూర్తి సంసిద్ధంగా ఉంది. కొంతమంది ఇప్పటికే చేరుకున్నారు. కాన్సులేట్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది’ అని కాన్సులేట్ మరో ట్వీట్‌లో తెలిపింది. భారత కాన్సులేట్ జనరల్, గుజరాత్ సమాజ్ అట్లాంటా, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా సంస్థల సహకారంతో ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా సంస్థ ఫ్లోరిడానుంచి వచ్చిన భారతీయులకోసం మూడు షెల్టర్లను ఏర్పాటు చేసింది. మరికొన్ని షెల్టర్లను తెరవడానికి, వారికి ఆహారం అందించడానికి కూడా వారు సిద్ధమవుతున్నారు. పలు భారతీయ కంపెనీలు కూడా ఇందుకోసం పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నాయి. మరోవైపు కరేబియన్ దీవుల్లోని సెయింట్ మార్టిన్ దీవినుంచి కూడా దాదాపు 60 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.