అంతర్జాతీయం

పార్క్‌లో దాడి మా పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, మార్చి 28: ఈస్టర్ పండుగ సందర్భంగా లాహోర్ పార్కులో ఆత్మాహుతి దాడికి తమ పనేనని పాకిస్తాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. క్రైస్తవుల లక్ష్యంగానే తాము దాడికి పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఆదివారం పొద్దుపోయాక జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతి చెందినవారి సంఖ్య 72కి చేరుకుంది. మృతుల్లో 29 మంది చిన్నారులున్నారని పంజాబ్ ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్ అధికార ప్రతినిధి దీబా షెహనాజ్ తెలిపారు. గాయపడ్డ 300 మందిలో 26 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ముష్కరుల దాడిలో బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని ఆమె పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడిలో 29 మంచి చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు చనిపోయినట్టు షెహనాజ్ చెప్పారు. మృతుల్లో 20 మంది క్రైస్తవులున్నారని తెలిపారు. లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ పట్టణంలోని గుల్షాన్-ఎ-ఇక్బాల్ పార్కు ఆదివారమంతా జనంతో కోలాహలంగా ఉంది. ఈస్టర్ కావడంతో క్రైస్తవుల కుటుంబాలు అక్కడకు చేరుకున్నాయి. సాయంత్రం సమయంలో తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి) మానవ బాంబు పార్కులో విస్ఫోటనం సృష్టించింది. క్రైస్తవులను లక్ష్యం చేసుకునే దాడికి పాల్పడినట్టు టిటిపి అధికార ప్రతినిధి ఇషానుల్లా ఇషాన్ ప్రకటించాడు. పేలుళ్లు సృష్టించడం ద్వారా ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గట్టి హెచ్చరిక చేశామని అతడు చెప్పుకున్నాడు. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకునే దాడికి దిగారన్న జమాతుల్ అరార్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. ‘క్రైస్తవులే లక్ష్యంగా దాడి జరగలేదు. పార్కు వారి ఒక్కరి కోసమే ఉద్దేశించింది కాదు. అందరూ ఉన్నారు. పాకిస్తానీయులందరిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు’ అని లాహోర్ డిస్ట్రిక్ కోఆర్డినేషన్ అధికారి మహ్మద్ ఉస్మాన్ (రిటైర్డ్ కెప్టెన్) పేర్కొన్నారు. చిన్నపిల్లల పార్కులో ప్రవేశించి మానవ బాంబు ఈ విస్ఫోటనాన్ని సృష్టించినట్టు లాహోల్ డిఐజి హైదర్ అష్రాఫ్ వెల్లడించారు. పది నుంచి 15 కిలోల పేలుడు పదార్థాలు ఇందులో వాడినట్టు ఆయన తెలిపారు. ఇలా ఉండగా జిన్నా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం పరామర్శించారు.

చిత్రం లాహోర్ పేలుళ్లలో మృతిచెందిన బాలల బంధువుల రోదనలు