అంతర్జాతీయం

తెలుగు బుడతడి ప్రతిభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

13 ఏళ్లకే లండన్ ఐక్యు క్లబ్‌లో సభ్యత్వం

లండన్, డిసెంబర్ 12: భారతీయ సంతతికి చెందిన 13 ఏళ్ల స్కూలు విద్యార్థి బ్రిటన్‌లోని ప్రతిష్ఠాత్మక ఐక్యు మెనసా క్లబ్‌లో సభ్యుడయ్యాడు. 162 మార్కులకు గాను 161 మార్కులు సంపాదించడం ద్వారా వెంకట సత్య శ్రీ రోహన్ చిక్కం అనే ఈ బుడతడు ఆ క్లబ్‌లో సభ్యత్వం సంపాదించాడు. క్యాటిల్ 3బి పేపర్, కల్చరల్ ఫెయిర్ స్కేల్ అనే రెండు పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావడమే కాకుండా దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన ఒక శాతం వారిలో స్థానం పొందిన తర్వాత అతనికి ఈ క్లబ్ సభ్యత్వం లభించింది. రోహన్ ప్రైమరీ స్కూలు స్థాయినుంచే తన టాలెంట్‌ను చాటడం ప్రారంభించాడని, గత ఏడాది యునైటెడ్ కింగ్‌డమ్ మ్యాథమాటికల్ చాలెంజ్ పోటీల్లో గోల్డ్ సర్ట్ఫికెట్ సంపాదించడం ద్వారా తన ప్రతిభ ఏమిటో నిరూపించాడని రోహన్ తండ్రి విష్ణు చిక్కం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు బ్రిటన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. రోహన్‌కు గణితం, ఫిజిక్స్ అంటే చాలా ఇష్టమని, ఇంట్లో గిటార్ వాయిస్తూ, జర్మన్ భాష నేర్చుకుంటూ, మొబైల్ యాప్‌లు అభివృద్ధి చేస్తూ ఉంటాడని ఆయన చెప్పారు. టెక్నాలజీలో రోహన్‌కున్న ఆసక్తిచూస్తే ఆ రంగంలో అతను ఎన్నో సాధిస్తాడన్న నమ్మకం తనకు ఉందని గత ఎనిమిదేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న విష్ణు చెప్పారు. మెనసా క్లబ్‌కు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతి పెద్ద ఐక్యు క్లబ్‌గా పేరుంది.