తెలంగాణ

నాగపూర్‌లో ముగ్గురు హైదరాబాదీల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళుతున్న ముగ్గురు హైదరాబాద్ యువకులను నాగపూర్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. జంటనగరాలకు చెందిన ఈ ముగ్గురు యువకులు కొద్దిరోజులుగా ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. నాగపూర్‌వరకు రోడ్డుమార్గంలోను, అక్కడినుంచి శ్రీనగర్ మీదుగా ఆఫ్గానిస్తాన్‌కు వెళ్లాలన్నది వారి పథకం. కాగా నాగపూర్ చేరుకున్నవెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరు ఒకసారి ఆఫ్గానిస్తాన్ వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. రెండుమూడురోజుల క్రితం వారు బయలుదేరి వెళ్లగా తప్పిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా మహారాష్టల్రో ఓ యువతి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తోందన్న విషయంపై ఆరా తీసిన ఆ రాష్ట్ర ఎటిఎస్‌కు హైదరాబాదీల సమాచారం అందడంతో తెలంగాణ పోలీసులతో కలిసి వారు చర్యలు తీసుకున్నారు.